YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

విత్తన కేంద్రాన్ని పరిశీలించిన మంత్రి సునిత

విత్తన కేంద్రాన్ని పరిశీలించిన మంత్రి సునిత
రామగిరి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విత్తన వేరుశనగ పంపిణీ కేంద్రాన్ని మంత్రి పరిటాల సునిత మంగళవారం పరిశీలించారు.  పంపిణీ కేంద్రం వద్ద రైతులకు విత్తన వేరుశనగను పంపిణీ చేసారు. తరువాత  రైతులతో మాట్లాడి విత్తనాల నాణ్యత గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ  రైతులు వేరుశనగ విత్తనాలు తీసుకునేపుడు పరిశీలించుకొని నాణ్యమైనవి తీసుకోవాలి.  నాణ్యతగా లేని విత్తనాలను వెనక్కు ఇచ్చి నాణ్యమైనవి అడిగి తీసుకోవాలి.  నాణ్యమైన వేరుశనగ విత్తనాలను తీసుకొని రైతులు మంచి దిగుబడులు సాధించాలని అన్నారు. అధికారులు వేసవి దృష్ట్యా ఉదయం, సాయంత్రం వేళల్లో రైతులకు విత్తనాలను పంపిణీ చెయ్యాలి.  వేసవి దృష్ట్యా విత్తన కౌంటర్ల వద్ద రైతులకు త్రాగునీటి సౌకర్యం, నీడ ఉండేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. విత్తన పంపిణీలో సర్వర్ సమస్యలు తలెత్తకుండా అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. 

Related Posts