నెల్లూరు
ఈవీఎంల ధ్వంసం కేసులో అరెస్టుయిన మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు నెల్లూరు జైలుకు తరలించారు.గురువారం ఉదయం 8.50 కి జైల్ లోకి తరలించారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. నంబూరి శేషగిరి రావు పై దాడి, కారంపూడి సిఐ నారాయణ స్వామిపై దాడి కేసుల్లో పిన్నెల్లికి రిమాండ్ విధంచారు.పిన్నెల్లిని పోలీసులు మాచెర్ల నుంచి పిన్నెల్లిని ఉదయం నెల్లూరుకు తరలించారు ఈ నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా సెంట్రల్ జైల్ వద్ద భద్రత పెంచారు. బారికేడ్లని ఏర్పాటు చేసారు.