YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

భారత్, వర్సెస్ ఇంగ్లండ్‌ సెమీస్‌ మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉందా?

భారత్,  వర్సెస్ ఇంగ్లండ్‌ సెమీస్‌ మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉందా?

ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచ కప్‌ 2వ సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో భారత్, ఇంగ్లాండ్ జట్లు తలపడనున్నాయి . గయానాలోని ప్రొవిడెన్స్ స్టేడియం వేదికగా గురువారం (జూన్ 27) రాత్రి 8 గంటలరే ఈ మ్యాచ్‌ ప్రారంభం కానుంది అయితే ఈ హై ఓల్టేజ్ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉందని తెలుస్తోంది. మ్యాచ్ జరిగే సమయంలో వర్షం అంతరాయం కలిగిస్తుందని వాతావరణ నివేదికలు చెబుతున్నాయి. అక్యూవెదర్ నివేదిక ప్రకారం జూన్ 27న గయానాలో పలు మార్లు వర్షం కురిసే అవకాశముంది. మ్యాచ్ ప్రారంభానికి అరగంట ముందు అంటే స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 10 గంటలకు వర్షం పడే అవకాశం 66 శాతం ఉంది. ఆ తర్వాత కూడా మేఘావృతమైన వాతావరణం కొనసాగుతుందని, ఉదయం 11 గంటల తర్వాత వర్షం కురిసే అవకాశం 75 శాతం ఉంటుందని సమాచారం.12 గంటల తర్వాత వర్షం తగ్గుముఖం పట్టినా 49 శాతం ఉంటుంది. తదుపరి మూడు గంటల పాటు, అంటే స్థానిక సమయం మధ్యాహ్నం 3 గంటల వరకు (12:30 AM IST), మేఘావృతమైన వాతావరణం కొనసాగుతుంది. మొత్తానికి 35-40 శాతం వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని సమాచారం.
కాబట్టి భారత్, ఇంగ్లండ్ మధ్య మ్యాచ్ అనుకున్న సమయానికి పూర్తవ్వదని తెలుస్తోంది. అదనపు సమయాన్ని వినియోగించుకున్నా వర్షం అంతరాయం కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.ఎందుకంటే గయానా కాలమానం ప్రకారం సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల మధ్య 50% వర్షం కురుస్తుంది. రాత్రి 7 గంటల నుండి వర్షం మొత్తం 20% నుండి 30% వరకు తగ్గుతుందని అక్యూవెదర్ నివేదిక పేర్కొంది. అంటే ఇక్కడ నిరంతరాయంగా వర్షాలు కురిస్తే గ్రౌండ్ తడిసిపోవడం ఖాయం. కాబట్టి భారత్, ఇంగ్లండ్ మధ్య మ్యాచ్ జరుగుతుందా అనేది ప్రశ్న.

Related Posts