YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

వామ్మో…భారీ సైజ్ లో పుట్టగొడుగు

వామ్మో…భారీ సైజ్ లో పుట్టగొడుగు

అనంతపురం
అక్షరాల ఐదు కేజీల బరువు ఉన్న పుట్టగొడుగు.. ఓ రైతు పొలంలో పుట్టుకొచ్చింది. పుట్టగొడుగులు పెంచే ఫామ్‎లో కూడా అంత భారీ పుట్టగొడుగు పెరగదేమో. అనంతపురం జిల్లా కుందుర్పి మండలం జానంపల్లికి చెందిన వడ్డే హనుమంతరాయుడు అనే రైతు పొలంలో ఇటీవల ఓ పుట్టగొడుగు బయటకు వచ్చింది. పొలం నుంచి బయటకు పుట్టుకొచ్చిన పుట్టగొడుగును తవ్వి తీశాడు రైతు హనుమంతురాయుడు. ఆ భారీ సైజులో ఉంటే పుట్టగొడుగును చూసి షాక్ అయ్యాడు. అదేవిధంగా దాని బరువు చూసి కంగుతిన్నాడు. రెండు అడుగుల వెడల్పుతో ఐదు కిలోల బరువు ఉన్న పుట్టగొడుగు చూసిన స్థానికులు, చుట్టుపక్క రైతులు ఆశ్చర్యపోయారు. 5 కిలోల బరువు ఉన్న అరుదైన భారీ పుట్టగొడుగు చూసేందుకు రైతు హనుమంతరాయుడు ఇంటికి జనం క్యూ కడుతున్నారు.
బస్తా పుట్టగొడుగులు పట్టుమని కిలో బరువు కూడా ఉండవు. కానీ ఈ పుట్టగొడుగు వెరైటీగా.. 5 కేజీల బరువు ఉంది. ఇంత పెద్ద పుట్టగొడుగును తాను ఎప్పుడు చూడలేదని రైతు హనుమంతురాయుడు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాడు. అంత భారీ పుట్టగొడుగును.. అరుదైనదిగా భావించి పరిశోధన కోసం వ్యవసాయ అధికారులకు అప్పగించారు. అరుదైన ఐదు కిలోల వెరైటీ పుట్టగొడుగును కళ్యాణదుర్గంలోని కృషి విజ్ఞాన కేంద్రంలో పరిశోధనకు తరలించారు. సాధారణంగా వర్షాలు పడే సమయంలో వ్యవసాయ పొలాల్లో పుట్టగొడుగులు పుట్టుకు రావడం సహజమే.. కానీ ఇంత భారీ పుట్టగొడుగు అరుదైన ఐదు కిలోల పుట్టగొడుగు స్థానికంగా చర్చినీయాంశమైంది.

Related Posts