YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

గనులపై కిం కర్తవ్యం...

గనులపై కిం కర్తవ్యం...

హైదరాబాద్, జూన్ 28,
బొగ్గు గనుల వేలంపై కేంద్రం పట్టుబడుతోంది తెలంగాణలో గనుల వేలంపై కేంద్రం ఘాటుగా స్పందించింది. గత తొమ్మిదేళ్లుగా తెలంగాణ సర్కార్ ఒక్క మినరల్ బ్లాక్ ను కూడా వేలం వేయలేదని కేంద్ర గనుల శాఖ పేర్కొంది. అందుకే జూన్ 30 నాటికి కనీసం ఆరింటికయినా వేలం పూర్తి చేయాలని స్పష్టం చచేసింది. ఓ పక్క కేంద్రం తీరును రాష్ట్ర కాంగ్రెస్ దుయ్యబడుతుండగా నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంది కేసీఆర్ తీరు. అంతేకాదు బొగ్గు గనుల వేలం విషయంలో బీఆర్ఎస్ డబుల్ డ్రామాను ఇప్పుడు జనం గమనిస్తున్నారు. పదేళ్ల క్రితం అధికారంలోకి వచ్చీ రాగానే బీఆర్ఎస్ 80 మిలియన్ టన్నుల నిక్షేపాలు ఉన్న అది పెద్ద తాడిచెర్ల బొగ్గు గనిని ఏఎంఆర్ అనే ఓ ఆంధ్రాకంపెనీకి 30 ఏళ్ల పాటు లీజుకు ఇచ్చేశారు కేసీఆర్. సింగరేణికి అది కోలుకోలేని దెబ్బ తీసినట్లయింది. 2015లో అప్పటి మోదీ ప్రభుత్వం తెచ్చిన మినరల్స్ అండ్ మైన్స్ చట్ట సవరణకు పార్లమెంట్ లో బీఆర్ఎస్ మద్దతు కూడా ఇచ్చింది. గతేడాది కూడా కోయగూడెం, సత్తుపల్లి ఓసీపీలకు వేలం పెడితే సింగరేణిని నాటి బీఆర్ఎస్ సర్కార్ వేలంలో పాల్గొనకుండా చేయడంతో రెండు ప్రైవేటు కంపెనీలు వాటిని దక్కించుకున్నాయి. పైగా ఆ రెండు సంస్థలు కూడా గులాబీ బాస్ కు కావలసిన వారికే దక్కాయనే ఆరోపణలు ఉన్నాయి.నోటిఫై చేసిన 11 గనుల్లో కనీసం ఆరింటికైనా ఈ నెల 30వ తేదీలోగా వేలం ప్రక్రియను పూర్తి చేయాలని ఈ నెల 16న కేంద్ర గనుల శాఖ నుంచి రాష్ట్రానికి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇంత తక్కువ డెడ్‌లైన్‌తో కేంద్రం ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నదనే కోణం నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఆరాతీసింది. దీంతో కేసీఆర్ ప్రభుత్వ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కేంద్రం నుంచి వచ్చిన తాజా ఉత్తర్వుల అనంతరం వేలం ప్రక్రియను ఆపడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవ తీసుకోవడంలేదంటూ బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో అప్పటి వాస్తవం వెలుగులోకి రావడం గమనార్హం. గనుల వేలానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది, స్పష్టమైన నిర్ణయం తీసుకున్నదీ రాష్ట్ర ప్రభుత్వమే అనేది ఇప్పుడు కీలకంగా మారింది.అప్పట్లో కేసీఆర్ సర్కార్ కేంద్రంలోని మోదీ సర్కార్ కు అనుకూలంగా ఉన్నందునే ఇప్పుడు వేలం ప్రక్రియ వేగవంతం చేయాలని ఆదేశిస్తూ డెడ్ లైన్ విధించాల్సి వచ్చిందని కాంగ్రెస్ చెబుతోంది. రాష్ట్రంలో విలువైన ఖనిజ సంపదను కాపాడుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్న సమయంలో గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం బయటపడడంతో దానికి ప్రత్యామ్నాయం ఏంటనేది ఇప్పుడు అధికారులకు సవాలుగా మారింది. బొగ్గు గనులతో పాటు తెలంగాణలోని ఖనిజ సంపదను అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం విధ్వంసం చేసిందనే ఆరోపణలకు ఈ అంశాలు బలం చేకూరినట్లయింది. ఖనిజ సంపదను ప్రైవేటు కంపెనీలకు కట్టబెట్టేందుకే అప్పట్లో కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారన్నది బహిర్గతమైంది. వాస్తవాలు ఇలా ఉండగా, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాత్రం.. కొత్తగా ఇప్పుడే బొగ్గు గనులను వేలం వేస్తున్నట్లు, అందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తున్నట్లు చేస్తున్న ట్వీట్లపై కార్మికులతో పాటుకార్మిక సంఘాల నేతలు మండిపడుతున్నారు. బొగ్గు గనులపై బీఆర్ఎస్ది డబుల్ గేమ్ అని ఫైర్ అవుతున్నారు.

Related Posts