YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కాంగ్రెస్ నేత డి ఎస్ కన్నుమూత

కాంగ్రెస్ నేత డి ఎస్ కన్నుమూత

హైదరాబాద్
కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు డి. శ్రీనివాస్ కన్నుమూశారు. హైదరాబాద్లోని తన నివాసంలో తెల్లవారుజామున 3 గంటలకు తుది శ్వాస విడిచారు. గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న డీఎస్, గుండెపోటుతో మరణించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

డీఎస్ మరణం బాధాకరం కేంద్ర మంత్రి బండి సంజయ్
పీసీసీ మాజీ ఛీఫ్ డి శ్రీనివాస్ మరణం బాధాకరం. తెలంగాణ రాష్ట్ర సాధనలో డీఎస్ పాత్ర మరువలేనిదని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. అయన మృతి పట్ల సంజయ్ ఒక ప్రకటన విడుదల చేసారు. డీఎస్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం.  గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మాజీ మంత్రి, పీసీసీ అధ్యక్షులు ధర్మపురి శ్రీనివాస్ మరణం బాధాకరం. ఉమ్మడి రాష్ట్ర మంత్రిగా, రెండు సార్లు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా డీఎస్ అందించిన సేవలు ఎనలేనివి. బ్యాంకు ఉద్యోగిగా జీవితాన్ని ఆరంభించిన డీఎస్ రాజకీయాల్లో చేరి అంచెలంచెలుగా ఎదిగి రెండుసార్లు పీసీసీ అధ్యక్షులుగా, మంత్రిగా, రాజ్యసభ సభ్యులుగా సేవలందించారు.తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో డి.శ్రీనివాస్ పాత్ర మరువలేనిది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు హామీని 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పొందుపర్చడంతోపాటు, ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పార్టీ అధిష్టానాన్ని ఒప్పించడంలో  డీఎస్ చేసిన క్రుషి మరువలేనిది. బడుగు, బలహీనవర్గాల సంక్షేమం కోసం డి.శ్రీనివాస్ నిరంతరం పాటుపడేవారు. ఆయన మరణం రాష్ట్రానికి తీరని లోటు. డీఎస్ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపం. ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని, కుటుంబ సభ్యులకు మనోధైర్యం చేకూర్చాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నానని అన్నారు..

మాజీమంత్రి, పిసిసి మాజీ అధ్యక్షులు డి. శ్రీనివాస్ మరణం బాధాకరం .... మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
మాజీమంత్రి, పిసిసి మాజీ అధ్యక్షులు డి. శ్రీనివాస్ మరణం బాధాకరమని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బంజారాహిల్స్ లోని  నివాసంలో డి. శ్రీనివాస్  పార్దీవదేహం వద్ద నివాళులు అర్పించార. కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సంతాపం, సానుభూతి తెలిపారు.

Related Posts