YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అమలాపురంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన

 అమలాపురంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన
 ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈరోజు తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో పర్యటించారు.. నవ నిర్మాణ దీక్షలో భాగంగా అమలాపురం కిమ్స్ ఆస్పత్రి ప్రాంగణంలో జరిగే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. హెలికాప్టర్లో అమలాపురం చేరుకున్న చంద్రబాబుకు జీఎంసీ బాలయోగి క్రీడా ప్రాంగణంలో ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, అధికారులు ఘనస్వాగతం పలికారు. అనంతరం చంద్రబాబు అక్కడి నుంచి నల్లవంతెన వద్దకు చేరుకున్నారు. నల్లవంతెన నుంచి ఎర్రవంతెన వరకు సుమారు రూ.11కోట్ల వ్యయంతో నిర్మించిన ఓఎన్జీసీ రిటైనింగ్ వాల్ను ప్రారంభించారు. అనంతరం సమీపంలోని ఏర్పాటుచేసిన ఎన్టీఆర్, మాజీ మంత్రి మెట్ల సత్యనారాయణ విగ్రహాలను ఆవిష్కరించారు. ఆ తర్వాత నూతనంగా నిర్మించిన నిర్మించిన సమనస గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభించారు. రంగాపురంలోని పురాతన శివాలయంలో నిర్వహించిన హోమంలో పాల్గొన్నారు.
1500 మందితో బందోబస్తు 
ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా జిల్లా ఎస్పీ విశాల్ గున్నీ ఆధ్వర్యంలో సుమారు 1500 మంది పోలీసులు అమలాపురంలో బందోబస్తు నిర్వహించారు.  ముఖ్యమంత్రి పర్యటించే అన్ని ప్రాంతాల్లోనూ క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. ప్రతి కార్యక్రమం వద్ద డీఎస్పీ స్థాయి అధికారుల పర్యవేక్షణలో సీఐలు, ఎస్ఐలు, సిబ్బంది బందోబస్తులో పాల్గొన్నారు.

Related Posts