YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

సెకండ్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న‌ త్రిభాషా చిత్రం `అర‌ణ్య‌`

సెకండ్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న‌  త్రిభాషా చిత్రం `అర‌ణ్య‌`
కెరీర్ ప్రారంభం నుండి విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌లు, వైవిధ్య‌మైన క‌థాంశాలున్న చిత్రాల్లో న‌టించ‌డానికి ఆస‌క్తి చూపుతున్న యువ క‌థానాయ‌కుడు రానా ద‌గ్గుబాటి. ఈయ‌న ప్ర‌స్తుతం భారీ బ‌డ్జెట్‌, గ్రాఫిక్స్‌తో రూపొందుతోన్న త్రిభాషా చిత్రంలో న‌టిస్తున్నారు. ఆ చిత్ర‌మే `హ‌థీ మేరే సాథీ`. చిత్ర నిర్మాణ సంస్థ‌ల్లో వ‌న్ ఆఫ్ ది బెస్ట్ ప్రొడ‌క్ష‌న్ హౌస్‌గా పేరున్న ఈరోస్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఈ సినిమాను నిర్మిస్తుండ‌టం విశేషం. రానా ద‌గ్గుబాటి, పుల్కిత్ సామ్రాట్‌, విష్ణువిశాల్‌, జోయా హుస్సేన్‌, క‌ల్కి కోచ్లిన్ ప్ర‌ధాన తారాగ‌ణంగా న‌టిస్తున్నారు. నేష‌న‌ల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్ట‌ర్ ప్ర‌భుసాల్మ‌న్ తెలుగు, హిందీ, త‌మిళంలో ఒకేసారి సినిమాను తెర‌కెక్కిస్తుండ‌టం విశేషం. 1971లో విడుద‌లైన బాలీవుడ్‌ క్లాసిక్ మూవీ `హ‌థీ మేరే సాథీ` స‌హా కొన్ని నిజ ఘ‌ట‌న‌ల‌ను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. త‌మిళంలో `కాడ‌న్‌`, తెలుగులో `అర‌ణ్య‌` పేరుతో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రం సెకండ్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది.  మ‌నిషి.. జంతువుల‌కు మ‌ధ్య ఉండే అనుబంధాన్ని ఈ చిత్రంలో హైలైట్‌గా చూప‌నున్నారు. 
రానా ద‌గ్గుబాటి, జోయ‌, కల్కి మూడు భాష‌ల్లోనూ న‌టిస్తుంటే హిందీలో పుల్కిత్ సామ్రాట్ చేసే పాత్ర‌ను త‌మిళఃలో విష్ణు విశాల్‌, తెలుగులో ర‌ఘుబాబు చేస్తున్నారు. శాంత‌ను మొయిత్రా ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తుండ‌గా, ఆస్కార్ అవార్డ్ విన్న‌ర్ ర‌సూల్ పూకుట్టి సౌండ్ డిజైన్ చేస్తున్నారు. 
ఏనుగులు వివిధ సంద‌ర్భాల్లో చేసే శ‌బ్ధాల‌ను అర్థం చేసుకోవ‌డానికి రానా థాయ్‌లాండ్‌లో 50 రోజుల వ‌ర్క్‌షాప్‌కి అటెండ్ అయ్యారు. అలాగే ఈ సినిమా కోసం ఆయ‌న ప‌దిహేను కిలోల బ‌రువు త‌గ్గ‌డం విశేషం. భారీ స్కేల్‌, బ‌డ్జెట్‌, విజువ‌ల్ ఎఫెక్ట్స్‌తో సినిమాను థాయ్‌లాండ్‌, కేర‌ళ‌లో చిత్రీక‌రిస్తున్నారు.  ఈరోస్ మేనేజింగ్ డైరెక్ట‌ర్ సునీల్ లుల్లా మాట్లాడుతూ - ``మ‌నుషుల‌కు, జంతువుల‌కు మ‌ధ్య ఉండే అనుబంధాన్ని తెలియ‌జేసే ట్రూ బ్లూ ఫిలిం మాది. ప్ర‌కృతి అందాల న‌డుమ సినిమాను అద్భుతంగా రూపొందిస్తున్నాం. మూడు భాష‌ల్లో సినిమా గ్రాండ్ రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం`` అన్నారు.  ద‌ర్శ‌కుడు ప్ర‌భు సాల్మ‌న్ మాట్లాడుతూ - ``నా ఫేవ‌రేట్ స‌బ్జెక్ట్‌. ఏనుగుల మ‌ధ్య షూటింగ్ చేయ‌డానికి ఇష్ట‌ప‌డ‌తాను. మా అనుభ‌వాల‌ను ప్రేక్ష‌కుల‌తో పంచుకోవ‌డానికి చాలా ఆస‌క్తిగా ఉన్నాం`` అన్నారు. 

Related Posts