YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఏపీలో పవర్ స్టార్ బ్రాండ్....

 ఏపీలో పవర్ స్టార్ బ్రాండ్....

నెల్లూరు, జూలై 3,
ఏపీలో మద్యం బ్రాండ్లపై రగడ మొదలైంది. కూటమి ప్రభుత్వం కొత్తగా పవర్ స్టార్ విస్కీ బ్రాండ్ తెచ్చిందని ఓ పోస్టు పెట్టింది. దీనిపై టీడీపీ, జనసేన పార్టీలు గట్టి కౌంటర్ ఇచ్చాయి. అది 2022 లో వైసీపీ ప్రభుత్వం తెచ్చిన బ్రాండ్ అని టీడీపీ, జనసేన వీడియోలు పోస్టు చేశాయి. పవర్ స్టార్ విస్కీ.. కూటమి ప్రభుత్వంలో కొత్త బ్రాండ్ అంటూ వైసీపీ విమర్శించారు. నాణ్యమైన మద్యం అంటూ జనసైనికుల్ని మెప్పించేలా పవర్ స్టార్ పేరుతో విస్కీని చంద్రబాబు సర్కార్ తెరపైకి తెచ్చిందని వైసీపీ ఎక్స్ లో పోస్టు పెట్టింది. ఏపీలో మాత్రమే ఈ బ్రాండ్ అందుబాటులోకి ఉంటుందని, నాణ్యమైన మద్యం అంటే ఇదేనా బాబూ అంటూ సెటైర్లు వేసింది. వైసీపీ ట్వీట్ కు అధికార టీడీపీ గట్టి కౌంటర్ ఇచ్చింది. జగన్ పాపాలు చేయడంలో శిశుపాలుడికి గాడ్ ఫాదర్ అంటూ ట్వీట్ చేసింది. తానే విషపు మద్యానికి బ్రాండ్ అంబాసిడర్ అయి ఉండి ఇతరులపై విష ప్రచారం చేస్తున్నారని టీడీపీ విమర్శించింది. ఐదేళ్లలో ప్రమాదకర మద్యంతో లక్షలాది జనం ప్రాణాలు తీశారని ఆరోపించింది. ప్రపంచంలో ఎక్కడా దొరకని డేంజరస్ లిక్కర్ త్రీ క్యాపిటల్స్, ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్రా గోల్డ్, బూమ్ బూమ్, 99 పవర్ స్టార్ ఇవన్నీ జగన్ దోపిడీ కోసం తెచ్చిన బ్రాండ్లు అని కౌంటర్ ఇచ్చిందివైసీపీ ట్వీట్ పై జనసేన ఘాటుగా స్పందించింది. ఆ పార్టీ అధినేత ఎన్నికల ప్రచారంలో తన పేరిట మద్యం బ్రాండ్ తెచ్చారని మాట్లాడిన వీడియో పోస్టు చేసింది. వైసీపీకి అల్జీమర్స్ వ్యాధి సోకితే అది మా తప్పా? ఆ బ్రాండ్ తెచ్చింది మీరే అని మర్చిపోయారా? అంటూ జనసేన ట్వీట్ చేసింది."పవర్ స్టార్ బ్రాండ్! నిజమే, ఆయన ఒక బ్రాండ్. మీరు తెచ్చిన కల్తీ మద్యానికి కాదు, మానవత్వానికి. మీరు చేసిన అవినీతికి కాదు, అభివృద్ధికి!మీరు తెచ్చిన సంక్షోభానికి కాదు, సంక్షేమానికి! బాధ పడకండి, మీరు తెచ్చిన కల్తీ మద్యం నుంచి, మీరు సృష్టించిన సంక్షోభం నుంచి ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు త్వరలోనే సంపూర్ణ విముక్తి పొందుతారు. ఇక మీరు శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకొని హాయిగా బెంగుళూరు ప్యాలస్ లో విశ్రాంతి తీసుకోవచ్చు" అని ట్వీట్ చేసింది.జనసేన శతఘ్ని టీమ్ సైతం వైసీపీ ట్వీట్ పై స్పందించింది. మద్యం అనే పదార్థాన్ని వైసీపీ రాజకీయ అస్త్రంగా వాడుకోవాలి అనే ఉద్దేశం ఉంటే మానుకోవాలని హితవుపలికింది. పవర్ స్టార్ బ్రాండ్ వైసీపీ తెచ్చిందేనని పేర్కొంది. మద్యంలో ఎంత అవినీతి చెయ్యొచ్చో అంతా చేశారని విమర్శించింది. మద్యపాన నిషేధం అన్న వైసీపీ ప్రభుత్వం ఉన్నంత వరకు మద్యం దుకాణాలని నడిపిందని విమర్శించారు. భవిష్యత్తులో మద్యం తాగేవారి తలపై కూడా చెయ్యి పెట్టి అప్పులు తెచ్చిన చరిత్ర వైసీపీ ప్రభుత్వానిదని సెటైర్లు వేశారు.

Related Posts