YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

చర్చల్లో పాల్గొనే ధైర్యం ప్రతిపక్షాలకు లేదు

చర్చల్లో పాల్గొనే ధైర్యం ప్రతిపక్షాలకు లేదు

న్యూఢిల్లీ, జూలై 3,
రాజ్యసభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలుచేశారు. 3వసారి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఎన్నుకుని.. ప్రజలు గొప్ప నిర్ణయం తీసుకున్నారంంటూ మోదీ పేర్కొన్నారు. ప్రజల నిర్ణయాన్ని తక్కువచేసి చూపే ప్రయత్నం చేస్తున్నారంటూ కాంగ్రెస్ సహా విపక్షాలపై మండిపడ్డారు. తమ పాలనకు పదేళ్లు ముగిశాయి, ఇంకా 20ఏళ్లు మిగిలి ఉందంటూ మోదీ పేర్కొన్నారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంలో భాగంగా రాజ్యసభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. రాష్ట్రపతి ప్రసంగం దేశప్రజలకు ప్రేరణ.. కలించాయని.. దశాబ్దాల తర్వాత దేశంలోని ప్రజలు వరుసగా మూడోసారి సేవ చేసే అవకాశాన్ని కల్పించారని ప్రధాని మోదీ అన్నారు. ఈ సందర్భంగా రాజ్యసభలో రచ్చచోటుచేసుకుంది.. విపక్షాల నినాదాల మధ్యనే ప్రధాని మోదీ ప్రసంగించారు.తమ విజయాన్ని చూసి కాంగ్రెస్‌ ఓర్వలేకపోతోందని.. దేశ ప్రజలు మమ్మల్ని పెద్దమనసుతో ఆశీర్వదించారంటూ ప్రధాని మోదీ పేర్కొన్నారు. తమపై విషప్రచారాన్ని ప్రజలు తిప్పికొట్టారని.. అంబేద్కర్‌ రాజ్యాంగం వల్లే తనలాంటి సామాన్యులు పార్లమెంట్‌ దాకా రాగలుగుతున్నారన్నారు. రాజ్యాంగం అంటే ఆర్టికల్స్‌ సమ్మిళితం మాత్రమే కాదు.. రాజ్యాంగంలో ప్రతీవాక్యం మహత్తరమైనది.. రాజ్యాంగం మనందరికీ మార్గదర్శకం అంటూ పేర్కొన్నారు. రాజ్యాంగ స్ఫూర్తి విలువైనదని.. దీపస్తంభంలా పనిచేస్తుందన్నారు. నవంబరు 24న రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకోవాలని నిర్ణయించినప్పుడు ఇక్కడ రాజ్యాంగాన్ని ప్రదర్శిస్తున్న వారు వ్యతిరేకించారంటూ విపక్షాలపై మండిపడ్డారు.ఈ ఎన్నికల ఫలితాలు పదేళ్ల ప్రగతికి నిదర్శనమే కాదు.. రాబోయే కాలంలో జరిగే అభివృద్ధికి ఈ ఫలితాలు సంకేతమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. రాబోయే ఏదేళ్లలో ఎన్నో నిర్ణయాలు తీసుకుంటామని.. రాబోయే కాలంలో మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు.ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరిస్తుందని ప్రధాని మోదీ అన్నారు. ఇది ప్రతి ఒక్కరిపై ప్రభావం చూపుతుందని.. ప్రతి తరగతికి అభివృద్ధి జరుగుతుందన్నారు. ఇది మాత్రమే కాదు, మూడవ స్థానానికి రావడం ప్రపంచ స్థాయిలో అపూర్వమైన మార్పులను కూడా తీసుకువస్తుందన్నారు.ప్రభుత్వంపై కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్నారని.. రిమోట్ ప్రభుత్వాన్ని నడపడం కాంగ్రెస్‌కు అలవాటు అంటూ ప్రధాని మోదీ ఎద్దెవా చేశారు. కాంగ్రెస్ ఆటో మోడ్ ప్రభుత్వాన్ని కోరుకుంటోంది.. రిమోట్ ప్రభుత్వాన్ని నడపడం ఆ పార్టీకి అలవాటైందంటూ చురకలంటించారు.పెద్దల సభను విపక్షాలు అవమానిస్తున్నాయని.. ఓడించినా వారి బుద్ధి మారలేదని మోదీ ఆగ్రహం వ్యక్తంచేశారు. 140 కోట్ల భారతీయులను విపక్షం మోసం చేసిందన్నారు. చర్చలో పాల్గొనే ధైర్యం లేక విపక్షాలు వాకౌట్ చేశాయని ఫైర్ అయ్యారు. నిజాలు చెబుతుంటే విపక్షాలు ఓర్వలేకపోతున్నాయని తెలిపారు. పంటల కొనుగోళ్లలో ఎన్నో రికార్డులు సృష్టించామన్నారు. MSPలో కూడా రికార్డు కొనుగోళ్లు జరిగాయని.. రైతులకు సాధికారత కల్పించేందుకు కృషి చేస్తున్నామని మోదీ తెలిపారు. రైతు సంక్షేమమే మా ప్రణాళికలో ప్రధానాంశమని.. రైతులను ఇబ్బందులకు గురిచేయడానికి తాము ఎప్పుడూ అనుమతించలేదంటూ పేర్కొన్నారు.
విపక్షాలపై చైర్మన్ ధన్కర్ ఫైర్..
రాజ్యసభలో ప్రధాని మోదీ విపక్షాల నినాదాల మధ్యనే ప్రసంగించారు.. అబద్దాలను చెప్పొద్దని.. తమను మాట్లాడనివ్వాలని విపక్షసభ్యులు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో విపక్షాలు మోదీ ప్రసంగిస్తుండగానే వాకౌట్ చేశారు. కాగా.. విపక్షాల వాకౌట్, సభ్యుల తీరుపై రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి ధన్కడ్ సైతం ఆగ్రహం వ్యక్తంచేశారు. విపక్షాలు రాజ్యాంగాన్ని అవమానిస్తున్నాయని.. ఇకనైన తీరును మార్చుకోవాలని సూచించారు.

Related Posts