YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

పవన్ పాలిటిక్స్ కు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్

పవన్ పాలిటిక్స్ కు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్

కాకినాడ, జూలై 4,
పవన్ కల్యాణ్.. ఏపీ డిప్యూటీ సీఎం. పవర్ పాలిటిక్స్ కు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా మారారు. ప్రమాణస్వీకారం చేశాక డే వన్ నుంచే రంగంలోకి దిగారు. తనకు అప్పగించిన శాఖలపై రివ్యూలు చేస్తూనే ఉన్నారు. పార్టీ పెట్టిన తర్వాత మొదటిసారి అధికారంలోకి వచ్చారు. గెలిచారు. పదవి చేపట్టారు. మరి తాను నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి పగ్గాలు చేపట్టిన పవన్ కల్యాణ్ తన మార్క్ చూపించేందుకు కూడా సిద్ధమయ్యారు.పవన్ సినిమా హీరోగా ఇప్పటి వరకు అందరికి తెలుసు. నిన్న మొన్నటిదాకా రాజకీయాలు, సినిమాలను బ్యాలెన్స్ చేస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు ఫుల్ టైం పొలిటీషియన్ గా మారారు. అంతకు మించి అధికారంలోకి వచ్చి కీలక శాఖలు చేపట్టారు. ముఖ్యమైన బాధ్యతలు భుజాన వేసుకున్నారు. సినిమా హీరోతో ఏమవుతుందని మొదట అంతా అన్నారు. వైసీపీ నేతలైతే ఎన్ని రకాలుగా కార్నర్ చేయాలో అంతగా చేశారు. కానీ ఎక్కడా బెదరలేదు, అదరలేదు. డిప్యూటీ సీఎంగా, కీలక శాఖలకు మంత్రిగా తానేంటో నిరూపిస్తున్నారు.పవన్ కల్యాణ్ సినిమా లో ఓ డైలాగ్ ఉంది. నేనొచ్చాక రూల్ మారాలి, రూలింగ్ మారాలి, టైం మారాలి, టైం టేబుల్ మారాలి అని. ఎస్ ఇప్పుడదే డైలాగ్ రిపీట్ అవుతోంది. పాలనలో అదే మార్క్ చూపిస్తున్నారు డిప్యూటీ సీఎం. పాలకుడిగా, మంత్రిగా తానేంటో నిరూపించుకోవాలన్న తపన పవన్ కల్యాణ్ లో చాలా కనిపిస్తోంది. పవన్ ఏదైనా కమిట్ మెంట్ తోనే పని చేస్తారన్న నమ్మకాన్ని నిలబెట్టుకునేలా రంగంలోకి దిగారు. ప్రస్తుతం వారాహి అమ్మవారి దీక్షలో ఉన్న పవన్.. పాలనలో తనదైన కీరోల్ పోషిస్తున్నారు. సింపుల్ గా ఉంటున్నారు.. జనంతో మమేకం అవుతున్నారు. ఆఫీసర్లతో రివ్యూలు చేస్తున్నారు. ట్రెండ్ ఫాలో అవ్వను.. ట్రెండ్ సెట్ చేస్తాను అన్నట్లుగానే పాలనా వ్యవహారాలను డీల్ చేస్తున్న విధానం అందరికీ కనెక్ట్ అవుతోంది.తన పార్టీ పోటీ చేసిన 21 స్థానాలకు 21 స్థానాలు గెలిచారు. 2 ఎంపీ సీట్లకు రెండింటిలోనూ విజయం సాధించారు. 100 పర్సెంట్ స్ట్రైక్ రేట్ తో ఎన్నికల్లో సత్తా చాటారు. ఇప్పుడు కూడా జనంతో కనెక్ట్ అయ్యే శాఖలనే తీసుకున్న పవన్.. వచ్చే ఐదేళ్లలో ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు అందించి 100 శాతం స్ట్రైక్ రేట్ సాధించాలన్న టార్గెట్ పెట్టుకున్నారు. అంటే కేవలం ఎన్నికల ఫలితాల్లోనే కాదు. పాలనా పరంగానూ అదే కమిట్ మెంట్, అదే టార్గెట్ తో పని చేస్తున్నారు. ప్రస్తుతం పవన్ దగ్గర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు ఉన్నాయి. ఇవన్నీ జనాన్ని జనసేనానితో కనెక్ట్ చేసేవే. గ్రామీణ జన జీవితాలను మార్చే అవకాశం ఇప్పుడు పవన్ చేతికి వచ్చింది.ఎన్నికల్లో గెలిచాక పిఠాపురం వచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. చెప్పిన కొన్ని మాటలు ఆయనలోని రాజకీయ పరిపక్వతను వేరే లెవెల్ కు తీసుకెళ్లాయి. పవన్ తాను నమ్మిన సిద్ధాంతం కోసం, నమ్మి ఓట్లు వేసిన జనం కోసం ఆదర్శంగా నిలిచారు. చెప్పాలంటే రాజకీయాల్లో కొత్త ట్రెండ్ క్రియేట్ చేశారు. గెలిచిన ఎవరైనా సరే అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేస్తారు. కానీ పవన్ మాత్రం.. తనను తొలిసారి గెలిచిపించిన పిఠాపురంలో మాత్రం మరోసారి పవన్ కల్యాణ్ అను నేను అంటూ ప్రమాణస్వీకారం చేశారు. పిఠాపురానికి అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చాకే ఊరేగించాలని చెప్పడం ద్వారా తన కమిట్ మెంట్ ను చాటుకున్నారు. ఇది ఈకాలం రాజకీయాల్లో బహుశా ఎవరూ చేయరు. ఎక్కడా చూసి ఉండరు కూడా. అదే మరి పవనిజం అంటే.సాధారణంగా జనం డబ్బుల్నే ప్రభుత్వాలు ఖర్చు చేస్తాయి. ఇంకొన్ని పనులకు అప్పులు తెచ్చి పనులు చేస్తుంటాయి. ప్రజలు ప్రత్యక్షంగా, పరోక్షంగా కట్టే పన్నులతోనే సర్కారు వారి బండి నడుస్తుంది. మరి జనం ఇచ్చే డబ్బులతో నడిచే ప్రభుత్వం ఒక్కో రూపాయిని ఎంత జాగ్రత్తగా, ఎంత బాధ్యతతో ఖర్చు పెట్టాలి. ఇదే ఆలోచనతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉన్నారు. అధికారంలోకి వచ్చిన వారు ఖజానాను ఒక ఫుట్ బాల్ మాదిరిగా ఆడుకుని వాడి వదిలేస్తుంటారు. ఓడిపోయాక కొత్త వారు వచ్చి చూస్తే ఖాళీతో పాటు భారీ లోటు, భారీ అప్పులే కనిపిస్తుంటాయి. అలా ఉంటుంది. కానీ పవన్ కల్యాణ్ మాత్రం.. ఖర్చు పెట్టే ప్రతి పైసాకు ఒక విలువ తేవాలనుకుంటున్నారు. దుబారా అసలే వద్దంటున్నారు. ప్రస్తుతం ఏపీ భారీ అప్పుల్లో ఉంది. సో ఈ విషయాన్ని గుర్తించిన డిప్యూటీ సీఎం తన క్యాంప్ ఆఫీస్ రిపేర్లు వద్దంటున్నారు. కొత్త ఫర్నీచర్ కూడా కొనొద్దని, తానే తెచ్చుకుంటానంటున్నారు.నిజానికి పవన్ ఓ సందర్భంలో ఎమ్మెల్యేగా వేతనం తీసుకుంటానని ప్రకటించారు. జీతం తీసుకుంటేనే జనం పడ్డ కష్టం, జనం ఇచ్చిన డబ్బు తీసుకుంటున్నందుకు మరింత బాధ్యత గుర్తుకు వస్తుందని గత నెలలో చెప్పుకొచ్చారు. కానీ తాజాగా పిఠాపురంలో పవన్ చెప్పిన మాటకు జనంలో మరింత రెస్పెక్ట్ పెంచేలా చేసింది. జీతం తీసుకుని పని చేద్దామనుకున్నానని, కానీ పంచాయతీ రాజ్ శాఖ అకౌంట్ చూస్తే డబ్బులే లేవని, చాలా అప్పులు ఉన్నాయన్నది తెలిసిందన్నారు. అవి చూశాక జీతం తీసుకునే పరిస్థితి అసలే లేదని చెప్పి జనం మెచ్చిన, జనానికి నచ్చిన నాయకుడిగా మరో అడుగు ముందుకేశారు.తనకు భయం లేదని, గట్టి వాన్ని అని, మొండివాన్ని అని, బాధ్యతగా ఉంటానంటూ పవన్ చెప్పిన మాట వెనుక చాలా అంతరార్థం ఉంది. బాధ్యతగా వ్యవహరిస్తే ప్రాణమైనా ఇస్తానంటూ చెప్పడం ద్వారా తన కమిట్ మెంట్ ఎలా ఉంటుందో క్లియర్ గా సంకేతాలు ఇచ్చారు.

Related Posts