YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

మళ్లీ ఆస్పత్రిలో అద్వానీ

మళ్లీ ఆస్పత్రిలో అద్వానీ

న్యూడిల్లీ, జూలై 4,
బీజేపీ అగ్రనేత, దేశ మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీ ఆరోగ్యం మరోసారి క్షీణించింది. ఆయన న్యూఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చేరారు. మథుర రోడ్డులోని అపోలో ఆసుపత్రిలో పార్టీ సీనియర్ నేతను ఎమర్జెన్సీకి తరలించారు. అద్వానీ సీనియర్ న్యూరాలజిస్ట్ డాక్టర్ వినీత్ సూరి పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, అబ్జర్వేషన్‌లో ఉన్నారని అపోలో ఆసుపత్రి ఒక ప్రకటన రిలీజ్ చేసింది. రాత్రి 9 గంటల సమయంలో ఆయనను అపోలో ఆస్పత్రికి తరలించారు. అద్వానీ అస్వస్థతకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.96 ఏళ్ల భారతరత్న లాల్ కృష్ణ అద్వానీ పరిస్థితి విషమించడంతో వారం రోజుల క్రితం రాత్రి 10.30 గంటలకు ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS)లో యూరాలజీ విభాగంలో చేరారు. అతని పరిస్థితి మెరుగుపడడంతో మరుసటి రోజు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. అద్వానీకి ఈ ఏడాది మార్చి 30న భారతరత్న అవార్డు లభించింది. 2015లో దేశంలోని రెండవ అత్యున్నత పౌర పురస్కారం అంటే పద్మవిభూషణ్‌తో సత్కరించారు. భారతరత్నతో సత్కరిస్తున్నట్లు ప్రకటన వచ్చిన వెంటనే అద్వానీ మాట్లాడుతూ.. తాను భారతరత్నను గౌరవంగా అంగీకరిస్తున్నాను. ఇది తనకు మాత్రమే దక్కిన గౌరవం కాదని.. మనం జీవితాంతం అనుసరించిన ఆలోచనలు, సూత్రాల పట్ల గౌరవం ఇది అని చెప్పారు. రాజకీయ నాయకుడిగానే కాదు శక్తివంతమైన వక్తలలో అద్వానీ కూడా ఒకరు. రామమందిర ఉద్యమంలో పెద్దన్న పాత్ర పోషించిన వారిలో అగ్రగణ్యుడు. భారతీయ జనతా పార్టీకి పునాది వేసిన వారిలో అద్వానీ ఒకరు. అతను రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS)తో కలిసి పని చేయడం ద్వారా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. మూడు సార్లు బీజేపీ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. దీంతో పాటు దేశానికి ఉప ప్రధానిగా కూడా పనిచేశారు.
అద్వానీ 1927 నవంబర్ 8న సింధ్ ప్రావిన్స్ (పాకిస్థాన్)లో జన్మించారు. కరాచీలోని సెయింట్ పాట్రిక్స్ స్కూల్‌లో చదివాడు. 1980 నుంచి 1990 మధ్య అద్వానీ బీజేపీని జాతీయ స్థాయిలో పార్టీగా మార్చడానికి కృషి చేశారు. 1984లో కేవలం 2 సీట్లు మాత్రమే గెలిచిన పార్టీకి లోక్‌సభ ఎన్నికల్లో 86 సీట్లు రావడంతో అద్వానీ చేసిన కృషికి తగిన ఫలితం కనిపించింది. ఆ సమయంలో ఇది చాలా మెరుగైన ప్రదర్శనగా చెప్పవచ్చు.

Related Posts