YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

హైదరాబాద్, జూలై 4,
తెలంగాణ ఉద్యోగుల సాధారణ బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశాలతో బదిలీలపై నిషేధాన్ని ఎత్తివేస్తూ ఆర్థికశాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. జులై 5వ తేదీ నుంచి 20 వరకు బదిలీల షెడ్యూల్ ప్రకటించింది. 2024 జూన్ 30 నాటికి ఒకే చోట నాలుగేళ్లుగా పనిచేస్తో్న్న ఉద్యోగులను తప్పనిసరిగా బదిలీ చేయాలని ఆదేశించింది. ఒకేచోట రెండేళ్లు పూర్తి కాని ఉద్యోగులను ట్రాన్స్ ఫర్ చేయొద్దని జీవోలో పేర్కొంది. కౌన్సెలింగ్‌ ద్వారా ఉద్యోగులను బదిలీ ప్రక్రియ చేపట్టనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్లు, వితంతువులు, భార్యభర్తలు(స్పౌజ్‌) లకు బదిలీల్లో ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొంది. ఉద్యోగులకు వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించి, ఆప్షన్లను స్వీకరించి బదిలీలు చేయనున్నారు.ఈ నెల 5 నుంచి 8 వరకు ఉద్యోగ సంఘాలతో బదిలీలపై చర్చించి వివరాలను ప్రకటించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. జులై 9 నుంచి 12వ తేదీ వరకు వెబ్ కౌన్సెలింగ్ ద్వారా ఉద్యోగుల నుంచి ఆప్షన్లు స్వీకరించనున్నట్లు ప్రకటించింది. జులై 13 నుంచి 18 వరకు ఉద్యోగుల బదిలీల అప్లికేషన్లు పరిశీలించనున్నారు. జులై 19, 20 తేదీల్లో ఉద్యోగుల బదిలీలపై ఉత్తర్వులు జారీ చేయనున్నారు. అలాగే ఈ నెల 21 నుంచి ఉద్యోగుల బదిలీలపై మళ్లీ నిషేధం అమల్లోకి వస్తుందని ఆర్థికశాఖ ప్రకటించింది.ఒకరి కంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఒకే చోటకు ట్రాన్స్ ఫర్ ఎంచుకుంటే అధికారులు ప్రాధాన్యత క్రమం మేరకు నిర్ణయం తీసుకుంటారని ఆర్థిక జీవోలో పేర్కొంది. ఈ కింద విధానంగా అధికారులు బదిలీలకు ప్రాధాన్యత ఇస్తారు.
భార్యాభర్తల బదిలీలు( ఇద్దరిలో ఒకరు మాత్రమే బదిలీ అవుతారు).
జూన్ 30, 2025లోపు పదవీ విరమణ చేసే ఉద్యోగులు బదిలీలు పెట్టుకుంటే వారికి అవకాశం కల్పిస్తారు.
70% లేదా అంతకంటే ఎక్కువ వైకల్యం కలిగిన ఉద్యోగుల బదిలీ
మెంటల్లీ రిటార్డెడ్ పిల్లలను కలిగి ఉన్న ఉద్యోగులు వైద్య సదుపాయాలు అందుబాటులో ప్రదేశాలకు బదిలీ అయ్యేందుకు వీలు కల్పిస్తారు.
వితంతువులు.
పలు వ్యాధులకు సంబంధించిన వైద్యపరమైన కారణాలు (స్వయంగా లేదా జీవిత భాగస్వామి లేదా పిల్లలు లేదా తల్లిదండ్రులు) చికిత్స కోసం సౌకర్యాలు అందుబాటులో ఉన్న ప్రదేశాలకు బదిలీ చేస్తారు. ఈ కింది క్రమంలో ప్రాధాన్యత ఇస్తారు.
1.క్యాన్సర్
2.న్యూరోసర్జరీ
3.కిడ్నీ మార్పిడి
4.కాలేయ మార్పిడి
5.ఓపెన్ హార్ట్ సర్జరీ
6.బోన్ టీబీ
కష్టతరమైన ప్రదేశాల్లో ఎక్కువగా కాలంగా పనిచేస్తున్న ఉద్యోగులను గుర్తించి , వారి బదిలీలకు అవకాశం కల్పిస్తారు. వ్యక్తిగత లేదా వైద్య కారణాల బదిలీపై ఉన్నతాధికారులు వెరిఫై చేస్తారు. ఈ కారణాలను ప్రభుత్వానికి రిపోర్టు చేస్తారు.

Related Posts