YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

జడ్జీల బ్లాక్ మెయిలింగ్...?

జడ్జీల బ్లాక్ మెయిలింగ్...?

హైదరాబాద్, జూలై 5,
గల్లీ లీడర్ల నుంచి ఎమ్మెల్యేలు, మంత్రులు, విపక్ష నేతలు, వారి కుటుంబ సభ్యులు, అనుచరులు.. ఇలా స్వపక్షం, విపక్షం.. మీ, మా అనే తేడా లేకుండా అనుమానం వచ్చిన ప్రతి ఒక్కరి ఫోన్‌ను ట్యాప్‌ చేసేశారు. అయితే ఇప్పుడీ లిస్ట్‌లో న్యాయమూర్తులు, వారి కుటుంబ సభ్యులు కూడా ఉన్నట్టు లేటెస్ట్‌గా తేలింది. న్యాయవ్యవస్థ.. ఇది రాజ్యాంగబద్ధంగా నడిచే ఓ ఇండిపెండెంట్ వ్యవస్థ.. ఇందులో ఎవరి ఇన్‌వాల్వ్‌మెంట్‌ ఉండదు.. ఎలాంటి పక్షపాతాలు ఉండవు. కానీ ఇందులో కూడా వేలు పెట్టి వ్యవస్థలను తమకు అనుకూలంగా మార్చుకున్నారు బీఆర్ఎస్‌ పెద్దలు.. ఇది మేం చెప్పడం లేదు.. పోలీసులు హైకోర్టు ధర్మాసనానికి సమర్పించిన అఫిడవిట్‌లో ఉన్న సంచలన విషయాలు. కేసులను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు ఏకంగా కోర్టులను కూడా ప్రభావితం చేశారు. దీనికి ఎగ్జాంపుల్ జస్టిస్‌ కాజా శరత్, ఆయన భార్య ఫోన్లు కూడా ట్యాప్ చేశారు.వారిద్దరు మాత్రమే కాదు హైకోర్టు జడ్జిలు, ప్రభుత్వానికి సంబంధించిన కేసులను వాదిస్తున్న న్యాయవాదులను కూడా వదల్లేదు. ఈ వివరాలు చెప్పింది ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ3గా ఉన్న నాయిని భుజంగరావు చెప్పిన విషయాలు.. అంటే బీఆర్ఎస్‌కు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడిన ప్రతిసారి వారి వ్యక్తిగత విషయాలను తెలుసుకొని.. వారిని బ్లాక్‌ మెయిల్ చేసి బెదిరించడం.. పరిస్థితులను, వ్యవస్థలను తమకు అనుకూలంగా మలుచుకున్నారని తేలిపోయింది. జడ్జిల కదలికలు, వ్యక్తిగత విషయాలపై ఎప్పటికప్పుడు ఆరా తీశారు. వారి వ్యక్తిగత జీవితంలో ఏదైనా తప్పు జరిగితే దాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలన్నది గత ప్రభుత్వ పెద్ద ఆలోచన అని తేలిపోయింది. అందుకే జడ్జిల కుటుంబ సభ్యుల ఎక్కడి వెళ్తున్నారు? ఎవరిని కలుస్తున్నారు? ఏం మాట్లాడుతున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టు తీర్పులు రాకూడదనే జడ్జిలను కూడా టార్గెట్ చేశారన్నది అర్థమవుతోంది. ఆర్టీసీ ఉద్యోగుల బంద్, ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్యలు బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చాయి. హైకోర్టు కూడా ఈ కేసుల విషయంలో గత ప్రభుత్వాన్ని తప్పు పట్టింది. ఇలాంటి కేసుల్లో ముందు ముందు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు వస్తే భవిష్యత్‌లో ప్రజల్లో వ్యతిరేకత పెరిగే అవకాశం ఉంది. అందుకే న్యాయమూర్తుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారన్నది మనకు అర్థమవుతున్న విషయం.. అంటే ఎక్కడా తమకు వ్యతిరేకత అనేది బయటికి రాకూడదు. ఇదే ఆలోచన కనిపిస్తోంది ఈ ట్యాపింగ్ వ్యవహారం వెనక.సీఎం రేవంత్ రెడ్డి నుంచి మొదలు పెడితే.. ముఖ్యమైన నేతలు, వారి అనుచరులు, డ్రైవర్లు.. ఆఖరికి గన్‌మెన్లు కూడా ఉన్నారు అందులో.. ఇంతా వీని వీరు ప్రజలకు ఏమైనా పనికొచ్చే పనులు చేశారా? అంటే అదీ లేదు. కమీషన్లు వసూలు చేయడం.. బీఆర్ఎస్‌ పార్టీకి డోనేషన్లు ఇచ్చేలా చేయడం.. ఇదే సాగింది పదేళ్లపాటు.. ఈ విషయాలన్ని బయటికి రావడానికి అసలు కారణం ఏంటంటే.. లెటెస్ట్‌గా మీడియాలో ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో జడ్జిలు కూడా బాధితులుగా ఉన్నారన్న కథనాలు వచ్చాయి. దీనిని సుమోటోగా తీసుకున్న హైకోర్టు.. కేసు వివరాలన్నింటిని తమకు అందించాలని ఆదేశించింది. దీంతో పోలీసులు అఫిడవిట్‌ సమర్పించారు. ఇప్పటికే రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు మాత్రమే ఉన్నారనుకున్న ఈ కేసులో.. బాధితులుగా న్యాయవ్యవస్థకు చెందిన వారు కూడా ఉన్నారని తేలింది.

Related Posts