చిత్తూరు
పుంగనూరు ఎంపిడిఓ కార్యాలయం ఎదురుగా శ్మశానంలో తెల్లవారుజామున ప్రభుత్వ రికార్డులు సంచిలో తీసుకొచ్చి కాల్చివేసిన వైనం కలకలం రేపింది. ఎంపిడిఓ ఆఫీస్ రికార్డులుగా అనుమానిస్తున్నారు. కాంట్రాక్టు కంప్యూటర్ ఆపరేటర్ సునీల్, గత ప్రభుత్వంలో ఒక కోటి 36లక్షల 61000 ప్రభుత్వ సొమ్ము తన సొంత ఖాతాలో మళ్లించుకున్నట్లు సమాచారం. ఈ విషయంపై ఎంపిడిఓ తో సహా ఇద్దరు అధికారులను శుక్రవారం జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సస్పెండ్ చేసారు.