YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

గ్రామీణాభివృద్ధి మనందరి బాధ్యత నవ నిర్మాణ దీక్ష 4వరోజు నిర్వహణపై ముఖ్యమంత్రి చంద్రబాబు

గ్రామీణాభివృద్ధి మనందరి బాధ్యత నవ నిర్మాణ దీక్ష 4వరోజు నిర్వహణపై ముఖ్యమంత్రి చంద్రబాబు

3రోజులు దీక్ష పూర్తయ్యింది,మిగిలిన 4రోజులు మరింత ఉత్సాహంగా పాల్గొనాలి. మనందరం గ్రామాలనుంచే వచ్చాం. మన జన్మభూమి అభివృద్ధి మన బాధ్యత.మన ఊరు, మన వార్డు భావనతో అభివృద్ధి యజ్ఞంలో భాగస్వాములు కావాలి. మంచితనంతోనే మన వ్యతిరేకుల్లో కూడా సానుకూలత సాధ్యం’’ అని ముఖ్యమంత్రి శ్రీ నారా  చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.మంగళవారం తన నివాసం నుంచి 4వరోజు నవనిర్మాణ దీక్ష సందర్భంగా సర్పంచులు,జిల్లా కలెక్టర్లు,వివిధ శాఖల అధికారులతో టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడారు.‘‘ప్రజల్లో సంతృప్తి దీక్షల సందర్భంగా 80%కు చేరడం సంతోషం. సంతృప్తి వల్ల ఉత్పాదకత మరింత పెరుగుతుంది.సమాజంలో సంతోషం నెలకొంటుంది. దేశంలోనే మన యంత్రాంగం నెంబర్ వన్ టీమ్.నాలుగేళ్లలో ఎన్నో విజయాలు సాధించాం.ఈ స్ఫూర్తితో మరింత ముందుకు సాగాలి.మెరుగైన సేవలు,నీతివంతమైన పాలన,సమర్ధ నాయకత్వంతోనే ప్రజల్లో సంతృప్తి వస్తుంది’’ అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.3వరోజు దీక్షలో 17లక్షల మంది పాల్గొన్నారు.19,000 శంకుస్థాపనలు,ఆస్తుల పంపిణీ జరిగింది.7,127 ప్రాంతాలలో ఆటల పోటీలు జరిగాయి.7,446 చోట్ల సాంస్కృతిక పోటీలు నిర్వహించారు.5,247 ఎగ్జిబిషన్లు జరిపారు. 3వరోజు గుంటూరు, తూర్పు గోదావరి,పశ్చిమగోదావరి జిల్లాలు ముందంజలో ఉన్నాయి. కడప, శ్రీకాకుళం, కర్నూలు దిగువన ఉన్నాయి. ‘‘విజ్ఞానానికి కులం,మతం లేదు. సమాజంలో  రెండే కులాలు ఉన్నాయి.డబ్బు ఉన్నవారు,లేనివారు.కులమతాల భావన అధిగమించాలి. ప్రతిభ,సమర్థత,తెలివితేటలే వ్యక్తిత్వానికి కొలమానాలు.సానుకూల నాయకత్వం రావాలి,ప్రగతి భావాలు పెంచుకోవాలి. నీట్ లో మన విద్యార్ధులు మంచి ప్రతిభ చూపారు.ఐఐటి,ఐఐఎం అన్నింటిలో మన బిడ్డలే ముందున్నారు.చదువుల్లో మన బిడ్డల ముందంజ శుభ పరిణామం’’ అని ప్రశంసించారు.‘‘అన్ని జిల్లాలలో మరింత ఉత్సాహంగా దీక్షలు నిర్వహించాలి.సాధికార మిత్రలు ఇంటింటికీ తిరగాలి.ప్రజలను చైతన్యపరచాలి.ప్రభుత్వ పథకాల లబ్ది పేదలకు అందించాలి.వాతావరణ మార్పులపై ఆర్టీజి అందిస్తున్న సమాచారాన్ని వినియోగించుకోవాలి.పిడుగుపాట్ల వల్ల,అకాల వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలి.రక్షిత తాగునీటిని పంపిణి చేయాలి. గ్రామాలు,వార్డులలో పారిశుద్ధ్యం మెరుగుపరచాలి’’ అని ఆదేశించారు. ఈ సందర్భంగా జరిగిన పరిష్కార వేదిక సర్వేలో, ‘‘తాగునీటి సమస్య పరిష్కారంపై 57% సంతృప్తి వ్యక్తం చేశారు. పోలవరం పనులు శరవేగంగా జరుగుతున్నాయని 53% తెలిపారు.నదుల అనుసంధానంపై 58% బాగుందన్నారు. నీరు-ప్రగతి పనులపై 48% సంతృప్తి వచ్చింది. రైతు రథం, పొలం పిలుస్తోందిపై 56%బాగుంది అన్నారు. వ్యవసాయానికి టెక్నాలజి అనుసంధానంపై 59% బాగుందన్నారు.రైతు రుణమాఫీ పట్ల 54% సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతిశాఖలో ఇదేవిధంగా ప్రజాభిప్రాయ సేకరణ చేయాలి. దానిని ఎప్పటికప్పుడు విశ్లేషించాలి. పథకాల లబ్ది పేదలకు అందేలా చూడాలి’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.ఈ టెలికాన్ఫరెన్స్ లో ప్రణాళికా శాఖ కార్యదర్శి సంజయ్ గుప్తా, రియల్ టైం గవర్నెన్స్ ఎండి అహ్మద్ బాబు,సీఎంవో సహ కార్యదర్శి రాజమౌళి,సెర్ప్ సీఈవో కృష్ణమోహన్, వివిధ జిల్లాల కలెక్టర్లు,ఆయా శాఖల అధికారులు,ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Related Posts