YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

సింగరేణికి ఒడిశా గనులు

సింగరేణికి ఒడిశా గనులు

హైదరాబాద్, జూలై 6,
ఎన్నో ఏళ్లుగా సింగరేణి ఎదుర్కుంటున్న సమస్యకు ఫుల్‌స్టాప్ పెట్టారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ఆగష్టు 13, 2015న 10 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్ధ్యం కలిగిన ఒడిశాలోని నైనీ బొగ్గు గనిని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్(ఎస్‌సీసీఎల్)కు కేటాయించింది కేంద్ర ప్రభుత్వం. అయితే అక్టోబర్ 2022లో స్టేజి-2 ఫారెస్ట్ క్లియరెన్స్ అందిన తర్వాత అటవీ భూమిని అప్పగించడంలో ఒడిశాకు చెందిన నైనీ బొగ్గు గని తీవ్ర జాప్యాన్ని ఎదుర్కుంటుంది. దీని వల్ల గని కార్యాచరణలో కూడా అసాధారణమైన ఆలస్యం కలుగుతోంది.ఈ సమస్య ఇటీవల కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి దృష్టికి వెళ్లడంతో.. ఆయన వెంటనే ఒడిశా ప్రభుత్వంతో విస్తృత స్థాయి చర్చలు జరిపారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ సమస్యను పరిష్కరించి, గనిని వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు ఒడిశా ప్రభుత్వం సహకరించాలని కోరారు. ఒడిశా ప్రభుత్వం కూడా దీనికి అంగీకారం తెలపడంతో జూలై 4న, సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్‌కు 643 హెక్టార్ల అటవీ భూమిని అప్పగించడానికి ఆమోదం వచ్చింది. ఈ సమస్యను త్వరతగిన పరిష్కరించడంలో సహాయపడిన ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాంఝీకి ధన్యవాదాలు తెలిపారు కిషన్ రెడ్డి. త్వరలోనే ఎస్‌సీసీఎల్ గని నుంచి ఉత్పత్తిని ప్రారంభిస్తుందని.. తద్వారా తెలంగాణ ఇంధన భద్రత అవసరాలు మరింత బలోపేతం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు కేంద్రమంత్రి.

Related Posts