YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

సిరిసిల్లకే అయన ముఖ్యమంత్రి

సిరిసిల్లకే అయన ముఖ్యమంత్రి
ముఖ్యమంత్రి కెసిఆర్ యావత్ తెలంగాణాకు కాకుండా,  కేవలం సిరిసిల్ల సిద్దిపేట లకే ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నాడని నల్లగొండ తాజామాజీ మ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు. అక్కడ ఇచ్చినన్ని నిధులు తెలంగాణాలోని మరే ప్రాంతానికి ఇవ్వకుండా వివక్ష చూపుతున్నారని అన్నారు. మంగళవారం నాడు  నల్లగొండ జిల్లా కేంద్రంలో జరిగిన విలేకరుల సమావేశంలో కోమటిరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ పాలనపై తీవ్రస్ధాయిలో విమర్శలు చేశారు..  గతంలో ఏ ముఖ్యమంత్రి హయాంలో లేని విధంగా ప్రస్తుత ముఖ్యమంత్రి కెసిఆర్ పాలనలో వివక్ష చూపుతున్నారని ఆరో్పించారు. తద్వారా దక్షిణ  తెలంగాణా అభివృద్దిలో వెనుకబడి పోతుందని అన్నారు. కేవలం తనకు మంచి పేరు రావద్దనే ఉద్దేశ్యంతోనే ఇక్కడి అభివృద్ది కార్యక్రమాలకు నిధులు విడుదల చేయకుండా జాప్యం చేస్తున్నారని అన్నారు. తమ ప్రాంతంలో నిర్మించే కాళేశ్వరం ఎత్తపోతల ప్రాజెక్టుకు వేలకోట్ల రూపాయలు మంజూరుచేసిన ప్రభుత్వం, నల్లగొండ జిల్లాకు సాగు, తాగు నీరిచ్చే ఎస్సెల్బిసి ప్రాజెక్టుకు మాత్రం ఒక్కరూపాయి నిధులు కూడా విడుదల చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కుర్చీ వేసుకుని పూర్తి చేస్తామని చెప్పిన ఎస్ఎల్బీసి ప్రాజెక్టును ముఖ్యమంత్రి  పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నాడని అన్నారు. నేను మొదలు పెట్టించింది కాబట్టే, కేవలం తనమీద కోపంతోనే ఎస్సెల్బీసి ప్రాజెక్టుకు  నిధులివ్వడంలేదని అన్నారు. బతుకమ్మ చీరల తయారీకి కేవలం సిరిసిల్ల జిల్లాకే 250కోట్ల ఆర్డర్లు ఇచ్చిన ముఖ్యమంత్రికి ఇతర జిల్లాల్లో చీరలు నేసే విషయం తెలియదా అని ప్రశ్నించారు. ఎప్పటినుంచో జిల్లాకేంద్రంగా ఉన్న నల్లగొండకు పోరాడితేకాని రాని మెడికల్ కళాశాల, సిద్దిపేటకు మాత్రం మొదటి విడతలోనే  మంజూరు చేసి 750కోట్లు నిధులు కేటాయించడంపై అభ్యంతరం  వ్యక్తం చేశారు. వాళ్ళ ప్రాంతానికి ఒకరకంగా, మన ప్రాంతానికి మరో రకంగా నిధులు మంజూరు చేస్తూ వివక్ష చూపుతున్నారని అన్నారు. ఆఖరికి ఎవరైనా ప్రమాదాల్లో చనిపోతే ఇచ్చే ఎక్స్ గ్రేషియా విషయంలో కూడా వివక్ష చూపుతున్నరని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవన్నీ చూస్తుంటే నల్లగొండ జిల్లా తెలంగాణాలో ఉందా లేదా అని ప్రశ్నిచారు.. మిషన్ భగీరథ కుంభకోణాల పై ప్రశ్నించినందుకే ఇలా చేస్తున్నారని అన్నారు.. రాష్ట్రంలో ఆర్టీసీ ని ఎత్తివేయడానికే కుట్ర జరుగుతుందని అన్నారు. ఆర్టీసీ న్యాయమైన డిమాండ్లకు, సిబ్బందికి  మా సంపూర్ణ  మద్దతు ఉంటుందన్నారు. రైతులు పండించే పంటకు బోనస్ ఇస్తేనే రైతులు జీవితాలు  బాగుపడతాయని అన్నారు.

Related Posts