YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

పిర్జాదిగూడలో కూల్చివేతలు..అడ్డుకున్న బీఆర్ఎస్ నేతలు

పిర్జాదిగూడలో కూల్చివేతలు..అడ్డుకున్న బీఆర్ఎస్ నేతలు

మేడ్చల్
పీర్జాదిగూడ మేయర్ పీఠం కోసం కాంగ్రెస్,బిఆర్ఎస్ పార్టీల కుస్తిలో సామాన్య ప్రజలు బలి అవుతున్నారు. అందులో భాగంగా మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ నగర పాలక సంస్థ పరిధిలోని సర్వే1లో వెలిసిన భారీ నిర్మాణాలను మేడిపల్లి మండల రెవెన్యూ అధికారులు భారీ పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేసారు.  అధికారులను  అడ్డుకున్న బీఆర్ఎస్ కార్పొరేటర్లు కౌడే పోచయ్య, హరిశంకర్ రెడ్డి అరెస్టు చేసారు. సీలింగ్ భూమి అంటూ కొర్రీ పెట్టీ నిర్మాణం చేపట్టి నివాసం ఉంటున్న ఇళ్లను సైతం కూల్చివేసారు. కూల్చివేతలపై పీర్జాదిగూడ మేయర్ చెక్క వెంకట్ రెడ్డి మండిపడ్డారు.
మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, పీర్జదిగూడా లో కాంగ్రెస్ పార్టీ మేయర్ పదవి కోసం ఇలా ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు.
మాజీ ఎమ్మెల్యే సుదీర్ రెడ్డి అల్లుడు అమర్ సింగ్ ను మేయర్ చేయాలని, అక్రమాస్తులను కూడబెట్టుకోవాలనే  కుట్రలో బాగామే ఈ కూల్చివేతలని ఆరోపించారు. సామాన్య ప్రజల ఇండ్లకు ఒక న్యాయం, కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ ఇండ్లకు ఒక న్యాయంగా  అధికారులు వ్యవహరిస్తున్నారు అంటూ మేయర్ అవేదన వ్యక్తం చేసారు. రాజకీయ కక్షతోనే పిర్జాదిగూడ కార్పొరేషన్ సామాన్య ప్రజలను మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఇబ్బందులకు గురి చేస్తున్నారు అని అన్నారు. పైసా పైసా జమ చేసి ఇంటి స్థలాలు కొనుగోలు, నిర్మాణాలకు హెచ్ ఎండీఏ, పీర్జాదిగూడ మున్సిపల్ నుంచి అని అనుమతులు తీసుకొని నిర్మించుకున్న బాధితులకు   అండగా టిఆర్ఎస్ పార్టీ  ఉంటుందని అన్నారు.

Related Posts