YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

గౌరవ డాక్టరేట్ అవార్డు కు ఎంపికైన వీరభద్రాచారి

గౌరవ డాక్టరేట్ అవార్డు కు ఎంపికైన వీరభద్రాచారి

ఖమ్మం,  
ఆయుర్వేదంలో విశిష్ట సేవలు అందించి నందుకు గాను ఖమ్మం జిల్లాకు చెందిన రామడుగు వీరభద్రాచారి కి ఐకానిక్ పీస్ అవార్డు కౌన్సిల్, న్యూఢిల్లీ వారిచే గుర్తింపు పొంది, గౌరవ డాక్టరేట్ అవార్డుకు ఎంపిక అయ్యారు.
ఖమ్మంలోని వీడిఓస్ కాలనీకి చెందిన రామడుగు వీరభద్రా చారి పారంపర్య ఆయుర్వేద వైద్యునిగా నిరుపేద, మధ్య తరగతి వర్గాలకు దాదాపు 430 మందికి సురక్షిత కాన్పుల వైద్య సేవలు అందించినందుకు గాను ఆయనకు ఈ అవార్డు దక్కింది.
ఈనెల 20న ఐకానిక్ పీస్ అవార్డు కౌన్సిల్ వారిచే న్యూఢిల్లీలోని  కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియా, రఫీ మార్గ్ లో  వీరభద్రాచారి కి అవార్డు ప్రధానం చేయనున్నారు.
వీరభద్రా చారి 1984లో గ్రామ అధికారి పట్వారి గా, 2000 సంవత్సరంలో రెవెన్యూ గ్రామ పరిపాలన అధికారి గాను, గ్రామ అభివృద్ధి అధికారి గాను, 2017లో రిజర్వ్ పంచాయతీ అధికారి గాను వివిధ హోదాలలో ఆయన విధులు నిర్వహించారు. 2015లో ఆయన పదవి విరమణ పొందారు. అలోపతి వైద్యం ద్వారా గ్రామీణ ప్రాంతాలలో పేదలకు  వంశ పారంపర్యం గా వైద్య సేవలను కొనసాగిస్తూ ఉండేవారు. ఆయన చేసిన సేవలకు గాను గతంలో సంగం అకాడమీ వారిచే నేషనల్ యూనివర్సిటీ అవార్డు, ది టార్గెట్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వారిచ్చే రవీంద్రనాథ్ ఠాగూర్ ఫ్రైడ్ అవార్డు 2024, విశ్వకర్మ నాలెడ్జి సెంటర్ వారిచే విశ్వకర్మ లెజెండరీ అవార్డు, హాస్యం ఆర్టిస్ట్ యూనియన్ వారిచే గౌరవ డాక్టరేట్ అవార్డు లను పొందారు. రామభద్ర ఆయుర్వేద మూలిక యోగ పీఠం ఖమ్మం వారిచే ప్రతి 27 రోజులకు ఒకసారి పుష్యమి నక్షత్రం రోజున 16 సంవత్సరాల లోపు పిల్లలకు ఆయుర్వేద ఇమ్యూనికేషన్  స్వర్ణ బిందు ప్రాశన ఉచిత చుక్కల మందును అందిస్తూ వస్తున్నారు.
గౌరవ డాక్టరేట్ అవార్డుకు ఎంపిక కావడం పట్ల వీరభద్రాచారిని పలువురు అభినందిస్తున్నారు.

Related Posts