దళితవాడలు, గిరిజనవాడలు, మత్స్యకారులు నివాస ప్రాంతాలలో 10 లక్షల రూపాయలుతో ఆలయాలు నిర్మాణాలు చేపట్టాలని టీటీడీ పాలకమండలి నిర్ణయించింది. మంగళవారం నాడు పాలకమండలి సమావేశం అయింది. మండలి చేసిన తీర్మాణాలను చైర్మైన్ సుధాకర్ యాదవ్ మీడియాకు వివరించారు. చిత్తూరు జిల్లా నాగలాపురంలో వేదపాఠశాల ఏర్పాటు, 2018-19 సంవత్సరంకు 4.84 కోట్లుతో మందులు కోనుగోళ్ళు, అలిపిరి వద్ద టాటా క్యాన్సర్ ఆసుపత్రికి ఎటా 25 లక్షల రూపాయలతో 33 సంవత్సరాలుకు లీజు లకు మండలి అంగీకారం తెలిపింది. ఆంధ్ర రాష్ర్టంలో పాల ఉత్పత్తిదారులును ప్రోత్సహించేందుకు 2:9శాతంతో కోనుగోళ్ళు, యస్వీ వేదిక్ యూనివర్శిటీ అనుభంధంగా శ్రీ బాలాజి వేద పరిపోషణ ట్రస్ట్ ఏర్పాటు కుడా మండలి అమోదం తెలిపింది. తిరుపతిలో సైన్స్ సిటి మ్యూజియం కోసం 70 ఏకరాల స్థలం కేటాయింపు, రూ 1.6 కోట్లతో భధ్రత విభాగం కోసం విడియో వాల్ ఏర్పాటు చేయనున్నారు. ధర్మగిరి వేదపాఠశాలలో విధ్యార్దులుకు ప్రోత్సహాలుకు అందజేసినట్లు వేదిక్ యూనివర్శిటీ విధ్యార్దులుకు అందజేస్తామని చైర్మైన్ వెల్లడించారు. ఈవో సింఘల్ మాట్లాడుతూ శ్రీవారి ఆభరణాలును ప్రదర్శనకు వుంచేందుకు ఆగమ పండితులు సలహా తీసుకుంటామన్నారు.