YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఓయూలో మీడియాపై పోలీసుల దాడి.. తీవ్రంగా ఖండించిన టీజేఎఫ్‌

ఓయూలో మీడియాపై పోలీసుల దాడి.. తీవ్రంగా ఖండించిన టీజేఎఫ్‌

హైద‌రాబాద్  జూలై 10
ఉస్మానియా యూనివ‌ర్సిటీ మెయిన్ లైబ్ర‌రీ వ‌ద్ద మీడియా ప్ర‌తినిధుల ప‌ట్ల పోలీసులు అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శించారు. డీఎస్సీ అభ్య‌ర్థుల ఆందోళ‌న‌ల‌ను క‌వ‌రేజ్ చేసేందుకు వెళ్లిన జీ తెలుగు రిపోర్ట‌ర్ ప‌ట్ల పోలీసులు అమ‌ర్యాద‌గా ప్ర‌వ‌ర్తించారు. జీ తెలుగు రిపోర్ట‌ర్ చొక్కా ప‌ట్టుకుని లాక్కెళ్లారు. నేను జ‌ర్న‌లిస్టును.. మీ ప‌ని మీరు చేసుకోండి.. మా ప‌ని మేం చేసుకుంటాం అంటుంటే కూడా పోలీసులు వినిపించుకోలేదు. ఆ రిపోర్ట‌ర్‌ను బ‌ల‌వంతంగా పోలీసు వాహ‌నంలో ఎక్కించి పోలీసులు త‌మ పైత్యాన్ని ప్ర‌ద‌ర్శించారు.
ఓయూలో జర్నలిస్టుల పట్ల పోలీసుల వైఖరి దారుణం : టీజేఎఫ్
ఉస్మానియా యూనివర్సిటీలో నిరుద్యోగులు చేస్తున్న ఆందోళనలను కవరేజ్ చేయడానికి వెళ్లిన జర్నలిస్టుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును టీజేఎఫ్ తీవ్రంగా ఖండిస్తుంది. విధి నిర్వహణలో భాగంగా జర్నలిస్టులు వార్తలు కవర్ చేయడానికి వెళ్తే పోలీసులు అరెస్ట్ చేయటమేంటి..? కనీసం మీడియా ప్రతినిధులు అనే సోయి లేకుండా పోలీసులు వ్యవహరించిన తీరు చూస్తుంటే… మీడియా స్వేచ్ఛను కాలరాయడమే అవుతుంది. జర్నలిస్టుల పట్ల పోలీసులు అనుసరిస్తున్న నిరంకుశ వైఖరిని మార్చుకోవాలని తెలంగాణ జర్నలిస్టుల ఫోరమ్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తుంది. అదుపులోకి తీసుకున్న జర్నలిస్టులను తక్షణమే విడుదల చేయాలని తెలంగాణ జ‌ర్న‌లిస్టు ఫోరం అధ్య‌క్షుడు ప‌ల్లె ర‌వికుమార్ గౌడ్, డిప్యూటీ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ మ‌హేశ్వ‌రం మ‌హేంద్ర డిమాండ్ చేశారు.

Related Posts