YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

దేశంలో దుష్పరిపాలన : సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి

దేశంలో దుష్పరిపాలన : సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి
ప్రధాని నరేంద్ర  మోడీ దేశంలో దుష్పరిపాలన సాగిస్తున్నాడు. మోడీ ప్రభుత్వం రైతాంగ వ్యతిరేక ప్రభుత్వం, రైతులకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు దేశాన్ని నష్ట పరిచే విధంగా ఉన్నాయి. సబ్ కా సాత్ సబ్ కా వికాస్ అనే నినాదం తప్పు 4సంవత్సారాల పాలనలో కార్పోరేట్ లు వికాసం చెందారని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి అన్నారు. అచ్చేదిన్ అనేది సామాన్యులకు రాలేదు, కాని వ్యాపార వర్గాలకు మాత్రమే అచ్చేదిన్ వచ్చింది. పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల పెంపుకు వ్యతిరేకంగా ఈనెల 20న దేశవ్యాప్తంగా ఆందోళన సిపిఐ శ్రేణులు  ఆందోళన చేపట్టనున్నాయి. ఆగష్టు 1 నుండి 14వ తేదీలవరకు మోడీ నాలుగు సంవత్సరాల దుష్టరిపాలనకు వ్యతిరేకంగా వివిధ రూపాలలో ప్రజలకు ప్రచారం చేస్తామని అన్నారు. దేశాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షించాలని కోరుతూ సెప్టెంబర్ మధ్య నుండి అక్టోబర్ వరకు జాతీ యాత్రలు చేపడుతున్నాం. అక్టోబర్ లో ఢిల్లీలో పెద్ద ఎత్తున ప్రదర్శన ఏర్పాటు చేయబోతున్నాం. వైఎస్సార్ పార్టీ ఎంపీల రాజీనామాలు స్పీకర్ ఎందుకు ఆమోదించడం లేదో అర్ధం కావడంలేదని అన్నారు. వైఎస్సార్ పార్టీ ఎంపీల రాజీనామాల గురించి ప్రశ్నించే చంద్రబాబు, ముందు వైఎస్సార్ పార్టీ నుండి తన పార్టీలోకి వచ్చిన శాసన సభ్యులతో ఎందుకు రాజీనామా చేయించలేదో సమాధానం చెప్పాలని అయన అన్నారు. వైఎస్సార్ పార్టీ ఎంపీల రాజీనామాల విషయంలో చంద్రబాబు సవాల్ ఆశ్చర్యకరంగా ఉంది. ఎన్నికల అవగాహనలు వేరు, వివిధ అంశాలపై కలసి పోరాటాలు చేయడం వేరు.షరతులు లేకుండా కలసి వస్తే వైఎస్సార్ పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి మేము సిద్ధమని అయన వెల్లడించారు. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ అనేది బిజెపి పార్టీ బి టీం. కేసీఆర్ ప్రతిపాదించిన ఫెడరల్ ఫ్రంట్ కు దేశవ్యాప్తంగా ప్రచారం లభించడం లేదు. ఆయన పెట్టిన ఫెడరల్ ఫ్రంట్ సేల్ కావడం లేదని అన్నారు. ఒక సీఎంగా కేసీఆర్ ఇతర రాష్ట్రాలకు వెళ్లినపుడు సీఎంగా ఆయనను ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్టీ నేతలు గౌరవిస్తున్నారు. ఇతర పార్టీల నుండి కేసీఆర్ ప్రతిపాదించిన ఫెడరల్ ఫ్రంట్ కు స్పందన శూన్యం. కేసీఆర్ మోడీకి వ్యతిరేకంగా ఏర్పాటవుతున్న ప్రతిపక్షాల కూటమిని బద్దలు కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. మోడీకి ఉపయోగపడే విధంగా ఫెడరల్ ఫ్రంట్ ను ఏర్పాటు చేస్తున్నాడు. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో వాస్తవ ఉద్దేశం ఏంటో తెలియదు కాని, ఆయన ఏర్పాటు చేసిన ఫెడరల్ ఫ్రంట్ ఫలితం మాత్రం బిజెపికి అనుకూలంగా ఉంటుందని అన్నారు. 

Related Posts