YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

దటీజ్ మహాలక్ష్మిగా రాబోతున్న హీరోయిన్ తమన్నా.

దటీజ్ మహాలక్ష్మిగా రాబోతున్న హీరోయిన్ తమన్నా.
క్వీన్ రీమేక్ సెట్స్ లో  హీరోయిన్ పరుల్ యాదవ్ పుట్టినరోజు వేడుకలు జరిగాయి. కన్నడ, తమిళ్, మలయాళం, తెలుగు భాషల్లో ఒకేసారి  తెరకెక్కుతున్న  ఈ చిత్ర షూటింగ్ మైసూర్ లో  శరవేగంగా జరుగుతోంది. షూటింగ్ స్పాట్ లో పరుల్ యాదవ్ పుట్టినరోజు వేడుకలు జరిగాయి. చిత్ర బృందంతో పాటు హీరోయిన్ కాజల్, హీరోయిన్ తమన్నా పాల్గొనడం జరిగింది. ఈ మూవీ  తమిళ వర్షన్ లో హీరోయిన్ కాజల్ అగర్వాల్ ముఖ్య పాత్రలో  నటిస్తోంది.  దర్శకుడు రమేష్ అరవింద్ కన్నడ, తమిళ్ వర్షన్ క్వీన్ రిమేక్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ  సందర్భంగా హీరోయిన్ పరుల్ యాదవ్ మాట్లాడుతూ... ''ఇది నాకు స్పెషల్ పుట్టినరోజు. ఈ చిత్రానికి పని చెయ్యడం మర్చిపోలేని అనుభూతి'' అన్నారు. క్వీన్ తెలుగు రీమేక్ లో తమన్నా మెయిన్ పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రానికి "దటీజ్ మహాలక్ష్మి" పేరును ఖరారు చేసినట్లు తమన్నా తెలిపింది. 100% లవ్ చిత్రంలో తమన్నా పాత్ర పేరు "దటీజ్ మహాలక్ష్మి" తను మెయిన్ హీరోయిన్ గా నటిస్తున్న చిత్రానికి అదే టైటిల్ పెట్టడం ఆనందంగా ఉందని తమన్నా చెప్పడం జరిగింది.

Related Posts