కర్నూలు
రాష్ట్రంలోని నిరుపేదలను,మధ్యతరగతి కుటుంబాలను దృష్టిలో ఉంచుకొని వినియోగదారులకు అందుబాటు ధరల్లో బియ్యము,కంది పప్పును స్థానిక రైతు బజార్ లో ఆధార్ కార్డు లేదా రేషన్ కార్డు తీసుకెళ్లిన ప్రతి ఒక్కకరి బియ్యం,కందిపప్పు అందుబాటులో ఉన్నాయని కర్నూలు జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య అన్నారు.నగరంలోని సీ క్యాం వద్ద ఉన్న రైతు బజార్ లో బియ్యము,కంది పప్పును ఆమె దుకాణంను జేసీ ప్రారంభించారు.ఈ అమ్మకాలు రైతు బజార్ల లో,రిటైల్ దుకాణాలలో వుంటాయని కందిపప్పు అసలు ధర 181 ఉండగా ప్రభుత్వం కేటాయించిన ధర 160 రూపాయలు మాత్రమే అని బియ్యం స్టీమ్ సోనామసూరి అసలు 55.85 ఉండగా ప్రభుత్వ ధర 48 రూపాయలలు అని,పచ్చి బీపీటి సోనామసూరి అసలు ధర 52.40 ప్రభుత్వ అమ్మకాలు ధర 48 రూపాయలకే అందిస్తున్నరాని తెలిపారు.ప్రతి వియోగ దారుడికి 5 కేజీల బియ్యం ఒక కేజీ కందిపప్పు అందజేస్తారని అన్నారు.