YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

వరుణ్ తేజ్, సంకల్ప్ రెడ్డి సినిమా కోసం హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్

వరుణ్ తేజ్, సంకల్ప్ రెడ్డి సినిమా కోసం  హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్
హీరో వరుణ్ తేజ్, దర్శకుడు సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో  వరుణ్ తేజ్ సరసన లావణ్య త్రిపాఠి, ఆడితిరావు హైదరీ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఫస్ట్ ఫ్రేం ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై రాజీవ్ రెడ్డి,  సాయిబాబు జాగర్లమూడి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.  ఈ సినిమాలో  హాలీవుడ్ తరహా స్టంట్స్ ఉండబోతున్నాయి. స్వయంగా హాలీవుడ్ నుంచి వచ్చిన స్టంట్ టీం ఆధ్వర్యంలో ఈ చిత్ర షూటింగ్ జరిగింది. హీరో  వరుణ్ తేజ్  చేత వీరు కొన్ని అద్భుతమైన స్టంట్స్  చేయించడం జరిగింది.  ఆ యాక్షన్  సన్నివేశాల చిత్రీకరణ పూర్తి కావడంతో హాలీవుడ్ స్టంట్ యూనిట్ తో వరుణ్ తేజ్  చివరి రోజు గడిపిన ఫోటోను  సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వాళ్ళతో కలసి పనిచేయడం మధురమైన అనుభూతి అని వరుణ్ తేజ్ తెలిపారు. 
ఈ చిత్రం కోసం  హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్  జిబెక్, టోడోర్ లాజరవ్ (జూజి), మరియు రోమన్  వర్క్ చెయ్యడం జరిగింది. హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ అధితి రావ్ హైద్రి పై 3డి స్కాన్ చెయ్యడం జరిగింది. సినిమాకు ఈ టెక్నాలజీ మరింత హెల్ప్ కానుంది. గతంలో వీరు ఎక్ష్పపాండబుల్స్2, ట్రాయ్, జీరో డార్క్ థట్టి, హీర్సులేస్, ది ఇంవీసిబుల్, లొవింగ్ పాబ్లో, రీబార్న్, స్నిప్పెట్, మార్కో పోలో, గేమ్ అఫ్ త్రోన్స్ వంటి హాలివుడ్  చిత్రాలకు వీరు పని చేసారు. ఈ సినిమా కోసం వరుణ్ తేజ్ స్టంట్స్  డూప్స్ లేకుండా ఒరిజినల్ గా చెయ్యడం జరిగింది.

Related Posts