YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఫోన్ ట్యాపింగ్ తో సంబంధం లేదు

ఫోన్ ట్యాపింగ్ తో సంబంధం లేదు

హైదరాబాద్, జూలై 11
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు తుది దశకు చేరుకుంది. ఈ కేసులో ఇప్పటికే పలు సంచలన విషయాలు బయటకువచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా, ఈ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి ప్రధాన నిందితుడు, ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు రాసిన సంచలన లేఖ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభాకర్ రావు అమెరికా వెళ్లిపోయారు. అయితే ఈ కేసులో ఆయనను ప్రధాన నిందితుడిగా చేర్చారు. ఈ నేపథ్యంలో ఆయన అమెరికా నుంచి పోలీసులకు రాసిన ఓ లేఖ ఆలస్యంగా బయటకు వచ్చింది. జూన 23న ప్రభాకర్ రావు జూబ్లీహిల్స్ పోలీసులకు లేఖ రాశారు. ఫోన్ ట్యాపింగ్ కేసుతో నాకు సంబంధం లేదని లేఖలో పేర్కొన్నారు. జూన్ 26న తాను ఇండియాకు తిరిగి రావాల్సి ఉండేదని.. అనుకోకుండా ఆరోగ్యం సహకరించక పోవడంతో అమెరికాలోనే ఉండాల్సి వచ్చిందని వివరించారు. గత కొంతకాలంగా క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు. అమెరికాలోని వైద్యుల సూచన మేరకే చికిత్స తీసుకుంటున్నట్లు ప్రభాకర్ వెల్లడించారు.‘ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో పోలీసులకు సహకరించేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. కానీ ప్రస్తుతం నేను అనారోగ్యంతో బాధపడుతున్నా. నాకు గతంలో ఉన్న మలిగ్నెంట్ క్యాన్సర్‌తోపాటు ఇప్పుడు బీపీ కూడా విపరీతంగా పెరిగింది. అందుకే రాలేకపోతున్నా. కావాలనే నాపై కొంతమంది అసత్య ఆరోపణలు చేస్తూ మీడియాలకు లీకులు ఇస్తున్నారు. ఇప్పటికే నాతోపాటు నా కుటుంబ సభ్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తనకు గతంలో ఉన్న మలిగ్నెంట్ క్యాన్సర్‌తో పాటు ఇప్పుడు బీపీ పెరిగిందని ప్రభాకరరావు లేఖలో తెలిపారు. తనపై అసత్య ఆరోపణలు చేస్తూ మీడియాకు లీకులిస్తున్నారని.. దీని వల్ల తాను, తన కుటుంబం మానసికంగా ఇబ్బంది పడుతున్నామని చెప్పారు. ఓ పోలీస్ అధికారిగా తాను ఎలాంటి తప్పూ చేయలేదని.. చట్టపరంగా విచారణ జపించాలని కోరారు. ఆరోగ్య సమస్యల నుంచి పూర్తిగా కోలుకున్నాక.. పోలీసుల ముందు హాజరై అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతానని లేఖలో స్పష్టం చేశారు. , బీఆర్ఎస్ హయాంలో అనధికారికంగా రాజకీయ నేతలు, పలువురు ప్రముఖులు, కొందరు ప్రైవేట్ వ్యక్తుల ఫోన్లను ట్యాప్ చేశారని ఆరోపణలున్నాయి. కొత్త ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. ట్యాపింగ్‌కు సంబంధించిన ఆధారాలు ధ్వంసం చేశారనే అభియోగాల నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యేక సిట్ ఏర్పాటు చేసింది. ఇప్పటికే ఈ కేసులో ఎస్ఐబీ మాజీ అధికారులు ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిపై ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకరరావుపైనా ఇప్పటికే నాన్ బెయిలబుల్ పీటీ వారెంట్ జారీ అయ్యింది. ఇటీవలే ఈ కేసుకు సంబంధించి నిందితులకు కోర్టు బెయిల్ నిరాకరించింది. కేసు విచారణలో ఉండగానే పలు సంచలన విషయాలు బయటపడ్డాయి. ఈ అంశంపై సిట్ పూర్తిస్థాయిలో విచారణ కొనసాగుతోంది.ఓ పోలీస్ అధికారిగా నేను ఎలాంటి తప్పు చేయలేదు. టెలీకాన్పరెన్స్‌ లేదా మెయిల్ ద్వారా ఎలాంటి సమాచారం ఇవ్వాలన్న నేను ఇస్తాను. నేను చాలా క్రమశిక్షణతో విధులు నిర్వహించా. నేనేం తప్పించుకుపోలేదు. ఎక్కడికీ పారిపోయే పరిస్థితి కూడా లేదు. పూర్తిగా కోలుకున్నాక మీ ముందు హాజరవుతా. అప్పుడే మీరు అడిగే అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇస్తాను. గతంలో కూడా పలుమార్లు ఉన్నతాధికారుకులకు ఇదే విషయాన్ని వాట్సాప్ ద్వారా చెప్పాను. నా దృష్టికి వచ్చిన ఈ సమాచారాన్ని విచారణ అధికారికి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాను.’ అంటూ లేఖలో పేర్కొన్నారు.

Related Posts