YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

నలుగురికి ముందస్తు బెయిల్

నలుగురికి ముందస్తు బెయిల్

విజయవాడ, జూలై 11
ఏపీ హైకోర్టులో వైసీపీ నేతలకు ఊరట లభించింది. టీడీపీ కార్యాలయంపై దాడికేసులో వైసీపీ నేతలకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు తీర్పు వెలువరించింది. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై 2021 అక్టోబర్‌ 19న దాడి జరిగింది. ఆ కేసుకు సంబంధించిన విచారణ ఇప్పుడు వేగంగా జరుగుతోంది. నాలుగు బృందాలుగా ఏర్పడిన పోలీసులు నిందితుల వివరాలను సేకరిస్తున్నారు. విధ్వంసానికి పాల్పడిన వారిని సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు. ఇప్పటికే ఐదుగురు వైసీపీ కార్యకర్తలను అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు. అయితే గతంలో టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో మొత్తం 56 మంది నిందితులు ఉన్నట్లు గుర్తించామన్నారు.ఈ ఘటనలో ప్రధాన నిందితులుగా దేవినేని అవినాష్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, కార్పొరేటర్లు ఆరవ సత్యం (సత్యనారాయణ), అంబేద్కర్‎తో సహా మరి కొందరిని గుర్తించించామన్నారు. త్వరలో మిగిలిన వారిని అరెస్టు చేసేందుకు రంగం సిద్దం చేసినట్లు తెలిపారు పోలీసు ఉన్నతాధికారులు. ఈ తరుణంలోనే ముందస్తు బెయిల్ కు దాఖలు చేసుకున్నారు వైసీపీ ముఖ్యనేతలు. వీరి ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ జరిపిన ఏపీ హైకోర్టు తాజాగా కీలక ఆదేశాలు జారీ చేసింది. లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురామ్, ఆర్కే, సజ్జల రామకృష్ణా రెడ్డి, దేవినేని అవినాష్‌కు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు తెలిపింది. సీఎం చంద్రబాబు నివాసంపై దాడి కేసులో జోగిరమేష్‌కు కూడా ముందస్తు బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. అలాగే ఈ కేసులో తదుపరి విచారణ జూలై 16కు వాయిదా వేసింది. ఈ క్రమంలో ఈ నెల 16 వరకు అరెస్ట్ చేయొద్దని తెలిపింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి జరిగినట్లు పిటిషన్ వేశారు టీడీపీ నాయకులు. ఆ పిటిషన్ పై ఇప్పటి వరకూ జరిపిన విచారణలో వైసీపీ కీలక నేతలకు ఊరట లభించినట్లయింది. అయితే దీనిపై భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో అన్న ఉత్కంఠ నెలకొంది.

Related Posts