YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

జపాన్ లో లాఫ్ రూల్...

జపాన్ లో లాఫ్ రూల్...

టోక్యో, జూలై 12,
రోజులో మీరు ఎంత సేపు నవ్వుతారు..? అసలు నవ్వుతారా..? ఈ ప్రశ్నలు చాలా సిల్లీగా అనిపిస్తుండొచ్చు. కానీ మనకున్న రకరకాల ఒత్తిళ్ల నుంచి పైసా ఖర్చు లేకుండా బయటపడే మార్గం నవ్వడం మాత్రమే. అందుకే లాఫింగ్ ఎక్సర్‌సైజ్‌లు చేయండి అంటూ చాలా మంది ఎక్స్‌పర్ట్స్‌ సలహాలు ఇస్తున్నారు. బలవంతంగా అయినా కాసేపు నవ్వుకోండి అని చెబుతున్నారు. జపాన్‌ ఈ విషయంలో ఓ అడుగు ముందుకు వేసింది. "చచ్చినట్టు నవ్వాల్సిందే" అని కొత్త రూల్‌ తీసుకొచ్చింది. ఆ దేశంలో ఇప్పుడదో చట్టం కూడా అయిపోయింది. పౌరులంతా రోజుకి కనీసం ఒక్కసారైనా కచ్చితంగా నవ్వి తీరాల్సిందే. అలా చేస్తే గుండెపోటు ముప్పు తగ్గిపోతుందట. అందుకే ఇలా కండీషన్ పెట్టింది.నార్త్ జపాన్‌లో యమగర్తలో ఆర్డినెన్స్ కూడా పాస్ చేసింది ప్రభుత్వం. స్థానిక యూనివర్సిటీలో నవ్వుపై పరిశోధనలు చేసి, గుండెపోటు తగ్గిస్తుందని కన్‌ఫమ్ చేసుకున్నాకే ఈ ఆర్డినెన్స్‌ ఇచ్చారు అధికారులు. గత వారమే ఈ నిబంధన తీసుకొచ్చారు. నిజానికి ఐదేళ్ల క్రితమే ఓ హెల్త్ జర్నల్‌లో ఇందుకు సంబంధించిన ఓ ఆర్టికల్ పబ్లిష్ అయింది. "నవ్వుతో కలిగే ప్రయోజనాలు" అనే టాపిక్‌పై లోకల్‌గా యమగట యూనివర్సిటీలో రీసెర్చ్ జరిగింది. ఇంత రీసెర్చ్ జరిగిన తరవాతే రూల్‌ తీసుకొచ్చారు. రోజుకోసారి నవ్వడం ద్వారా మానసికంగా, శారీరకంగా కలిగే ప్రయోజనాలేంటో ప్రజలకు అర్థం అవుతుందనే ఉద్దేశంతోనే ఈ నిబంధన తీసుకొచ్చినట్టు ప్రభుత్వం వివరణ ఇస్తోంది. అటు వర్క్‌ ప్లేసెస్‌లోనూ ఈ రూల్‌ని కచ్చితంగా అమలు చేయాలని ఆదేశాలు అందాయి. పని వాతావరణం ఎప్పుడూ సంతోషంగా ఉండాలని తేల్చిచెప్పారు. అంతే కాదు. ప్రతి నెల 8వ రోజుని "డే ఆఫ్ లాఫ్టర్"గా జరుపుకోనున్నారు. అయితే..ఈ రూల్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు మంచిదే అంటుంటే మరి కొందరు ఇదేం రూల్ అని మండి పడుతున్నారు. నవ్వాలా వద్దా అన్నది వ్యక్తిగత ఇష్టమని, రాజ్యాంగం కల్పించే హక్కుని కాదని బలవంతంగా నవ్వమంటారా అని ప్రశ్నిస్తున్నారు. నవ్వడం ఎంత ముఖ్యమైనప్పటికీ కొంత మంది లోలోపలే హ్యాపీగా ఫీల్ అవుతారని, అలాంటి వాళ్లూ నవ్వాలని ఒత్తిడి తీసుకురావడం సరికాదని వాదిస్తున్నారు. అంతే కాదు. ఆరోగ్య కారణాల వల్ల నవ్వలేని వాళ్లకి ఈ రూల్ నుంచి మినహాయింపు ఇవ్వాలనీ అంటున్నారు.నవ్వడం ఎంత మంచిదే అయినా ఇలా బలవంతం చేసి నవ్వించడం వల్ల ఎలాంటి ఉపయోగముండదని తేల్చి చెబుతున్నారు. అంతకు ముందు రీసెర్చ్ కోసం 17 వేల మందిపై స్టడీ చేశారు. వాళ్లందరూ ఎప్పుడెప్పుడు ఎంత సేపు నవ్వుతారో అని అడిగి తెలుసుకున్నారు. కొన్నేళ్ల పాటు వాళ్ల హెల్త్ రికార్డ్‌ని ట్రాక్ చేశారు. వారంలో కనీసం ఓసారైనా నవ్విన వాళ్లలో గుండె సంబంధిత సమస్యలు చాలా అరుదుగా కనిపించాయి. నెలకోసారి నవ్వే వాళ్లలో కొన్ని సమస్యలు కనిపించాయి. ఈ రీసెర్చ్ ఆధారంగానే ప్రభుత్వం అక్కడ నిబంధన తీసుకొచ్చింది.

Related Posts