YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

జులై 24 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

జులై 24 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

హైదరాబాద్
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. బడ్జెట్ సమావేశాలను 2024, జూలై 24వ తేదీ నుంచి ప్రారంభించాలని నిర్ణయించింది ప్రభుత్వం. ఈ మేరకు రివ్యూ మీటింగ్ నిర్వహించారు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్, అసెంబ్లీ స్పీకర్ ప్రసాదరావు. ఈ సమావేశానికి ప్రభుత్వ విప్ లతోపాటు సీఎస్, డీజీపీ, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ఈ నెల 24 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై స్పీకర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రభుత్వ విప్ లు, సీఎస్, డీజీపీ, అధికారులు హాజరయ్యారు. ప్రస్తుతం రైతు భరోసా విధివిధానాల ఖరారు కోసం ఏర్పాటు చేసిన మంత్రి వర్గ ఉపసంఘం జిల్లాలో పర్యటిస్తోంది. ఈ కమిటీ సేకరించిన వివరాలపై అసెంబ్లీలో చర్చించనున్నారు. అలాగే పూర్తి స్థాయి బడ్జెట్ ను కూడా అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం.
అలాగే జాబ్ క్యాలెండర్ ను సైతం ఈ సమావేశాల్లోనే ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి.

Related Posts