YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

స్టాంపులు, రిజిస్ట్రేషన్ల్లా శాఖను పునర్వ్యవస్థీకరించాలి పలు ప్రజా సంఘాలు డిమాండ్

స్టాంపులు, రిజిస్ట్రేషన్ల్లా శాఖను పునర్వ్యవస్థీకరించాలి  పలు ప్రజా సంఘాలు డిమాండ్

జిల్లాల పునర్విభజనలో భాగంగా వరంగల్ జిల్లాను ఆరు జిల్లాలుగా విభజించిన తెలంగాణ ప్రభుత్వం స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖను పునర్వ్యవస్థీకరించకపోవడం పరి విమర్శలకు సావిస్తోంది. జిల్లాల విభజన సమయంలో స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖపై అధికారులు నిర్లక్ష్యాన్ని ప్రదర్శించడం మూలంగా ఆ శాఖ ఇప్పటికే అలాగే ఉండిపోవడం తో ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురికావాల్సి వస్తుంది. జిల్లాల విభజన సమయంలో అధికారులకు ప్రజలకు పాలనపరమైన విధానాలకు అనువుగా ఉండే రీతిలో ఆయా మండలాలను ఒక యూనిట్ గా చేసి జిల్లాలో చేర్చడం జరిగింది. అయితే జిల్లాలోని రిజిస్ట్రేషన్ శాఖ ఇప్పటికి మారకపోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులకు గురికావాల్సి వస్తుందని వాపోతున్నారు.వరంగల్,వరంగల్ పోర్ట్, హనుమకొండ జిల్లా కేంద్రంలో ఉన్న మూడు సబ్ రిజిస్టర్ కార్యాలయాలలో మండలాల విభజన సక్రమంగా జరగకపోవడం పట్ల ప్రజలు తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు.ఉమ్మడి వరంగల్ జిల్లా గా ఉన్న సమయంలో ఏర్పాటైన సబ్ రిజిస్టర్ కార్యాలయాల ఏర్పాటు హేతుబద్ధంగా జరగలేదన్న విమర్శలు ఉన్నాయి. ఆ క్రమంలో జిల్లాలోని వివిధ సభ్యుల కార్యాలయాలలో రెండు మూడు ఆ పైన మండలాలు కలిగిన సబ్ రిజిస్టర్ కార్యాలయాలు ఉన్నాయి. వరంగల్ హనుమకొండ జిల్లా కేంద్రంలో ఉండబడిన వరంగల్ రూరల్ వరంగల్ పోర్ట్ హనుమకొండ సబ్ రిజిస్టర్ పరిధిలో ఉన్న మండలాల విభజన సహేతుకంగా, హేతుబద్ధంగా జరగలేదని దాంతో ఆయా మండలాల గ్రామాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వాపోతున్నారు. జనగాం, మహబూబాబాద్, హనుమకొండ, పరకాల , నర్సంపేట తో పాటు ఇంకొన్ని సబ్ రిజిస్టర్ కార్యాలయాలలో ఎక్కువ మండలాలు ఉండడం కొన్నింటిలో తక్కువ మండలాలు ఉండి కార్యాలయాలను నిర్వహణ చేయడం కష్టసాధ్యంగా మారిందని పేరు చెప్పడానికి ఇష్టం లేని అధికారులు అంటున్నారు. వరంగల్ రూరల్ పరిధిలో గతంలో గీసుకొండ సంగేమ్ మండలాలు పూర్తిగా ఉండగా వరంగల్ మండలం సగం గ్రామాలతో ఉండేది. దాంతో వరంగల్ మండల ప్రజలు సుదీర్ఘకాలం హనంకొండ సబ్ రిజిస్టర్ కార్యాలయానికి వెళ్లి రిజిస్ట్రేషన్లు చేసుకోవడం ఆర్థికంగా భారవతమే  కాకుండా ప్రయాణానికి తీవ్రంగా ఇబ్బందులు పడవలసి వచ్చేదని ఆవేదన పడ్డ సందర్భాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఇటీవల రిజిస్ట్రేషన్స్ స్టాంప్ ల శాఖ వరంగల్ మండలంలోని మిగిలిన గ్రామాలతో పాటు హనంకొండ మండలంలోని కొన్ని గ్రామాలను వరంగల్ రూరల్ పరిధిలోకి చేర్చారు. దీని మూలంగా వరంగల్ పోర్ట్ పరిధిలో ఉన్న ఐనవోలు మండలం పూర్తిగా హన్మకొండ సబ్ రిజిస్టర్ పరిధిలోకి వెళ్ళింది. దాని కారణంగా వరంగల్ పోర్ట్ కార్యాలయం ఒకే మండల పరిధిలో ఉండడం పట్ల పలు విమర్శలకు తావిస్తుందని మండల ప్రజలు వాపోతున్నారు.
జిల్లాకో రిజిస్ట్రేషన్ కార్యాలయం ఏర్పాటు చేయాలి.
జిల్లా ప్రజలకు పాలనపరమైన సౌలభ్యాన్ని అందించాలంటే ప్రతి జిల్లాకు కొత్తగా ఆర్వో ఆఫీస్ ఏర్పాటు చేయాలని ప్రజలు తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
 ఇదిలా ఉండగా జిల్లాలు ఏర్పాటు సమయంలో ఆయా మండలాలను ఒక సబ్ రిజిస్టార్ కార్యాలయం కేంద్రంగా మండలాలను  ఉంచకపోవటం పట్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. జిల్లాల విభజన ఎంత సమగ్రంగా జరిగిందో సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల ఏర్పాటు సైతం అంతే అసమగ్రంగా జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో వరంగల్ ఉమ్మడి జిల్లా పరిధిలో ఉన్న హెడ్ ఆఫీసును పునర్వ్యవస్థీకరించి ఆయా జిల్లాల పరిధిలో ఒక్కో హెడ్ ఆఫీస్ ను ఏర్పాటు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరిగినట్టుగానే స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖను పునర్వ్యవస్థీకరించి జిల్లాకు రిజిస్ట్రేషన్ హెడ్ ఆఫీస్ ను ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. రెవెన్యూ, పోలీసు శాఖను  విభాగాలను విభజించినట్టుగానే స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖను విభజించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.అదే విదంగా సబ్ రిజిస్టర్ కార్యాలయాలను నూతనంగా ఏర్పాటు చేసి మండలాల విభజన సాహేతుకంగా జరగాలని జిల్లా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.ఒక సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం పరిధిలో ఐదు ఆరు మండలాలు ఉండటం మరో సబ్ రిజిస్టర్ పరిధిలో ఒకటి రెండు మండలాలు ఉండడం పట్ల ప్రజలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖకు చెందిన అధికారులు వీటిపై దృష్టి సారించి మండలాన్ని ఒక యూనిట్ గా ఆయా సబ్ రిజిస్ట్రేషన్ పరిధిలో ఉండే విధంగా చర్యలు తీసుకొని విభజన చేపట్టడంతో పాటుగా హెడ్ ఆఫీస్ ను ఏర్పాటు చేసి ప్రజలకు పాలనాపరమైన సౌకర్యాలు అందించాలని డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా సబ్వే సర్ కార్యాలయాలలో సిబ్బంది కొరత ఉండడం అక్కడ పనిచేస్తున్న అధికారులపై భారం పడుతుందని పంపుతున్నారు. జిల్లాలోని కొన్ని సబ్ రిజిస్టర్ కార్యాలయాలలో ఔట్సోర్సింగ్ లో పనిచేస్తున్న సిబ్బంది ఉన్నారని వారిలో జవాబుదారితనం లోపిస్తుందన్న అనుమానాలు ప్రజల వ్యక్తం చేస్తున్నారు.సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ ఉండే విధంగా ప్రభుత్వం సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు

Related Posts