- 2017 హిందీ పదంగా ఎంపిక చేసిన ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీస్
గత ఏడాదికి హిందీ పదంగా 'ఆధార్' ను ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీ ఎంపిక చేసింది. దాంతో ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీ 2017 హిందీ పదంగా ఆధార్ ఘనత దక్కించుకుంది. గత ఏడాదిలో ఆధార్ గుర్తింపు కార్డుకు ఉన్న ప్రాముఖ్యత కారణంగా ‘ఆధార్’ అనే పదం తరచూ వార్తల్లో నిలిచింది. ఈ ఏడాది కూడా ఆధార్ హిందీ పదాని అదే స్థాయిలో పాపులారిటీ వచ్చే అవకాశం ఉంది. జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్ సందర్భంగా ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీస్ ఓ కార్యక్రమంలో ‘ఆధార్’ హిందీ పదాన్ని ‘హిందీ వర్డ్ ఆఫ్ ద ఇయర్’ గా ప్రకటించింది.
అయితే, ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీస్.. ఎంపికలో భాగంగా ఆధార్ హిందీ పదంతో పాటు మిగతా మిత్రోం, నోట్ బందీ, గో-రక్షక్ హిందీ పదాలను కూడా పరిగణనలోకి తీసుకుంది. కానీ, దేశవ్యాప్తంగా ఆధార్‌కు సంబంధించి పలు చర్చలు, సమావేశాలు అధికస్థాయిలో జరగడమే వర్డ్ ఆఫ్ ద ఇయర్‌గా ఆక్స్‌ఫర్డ్ ఎంపిక చేయడానికి కారణమని సౌరభ్ ద్వివేది అనే పాత్రికేయులు చర్చల సమయంలో వెల్లడించారు.