తిరుమల
శ్రీవారి దర్శనం కోసం భక్తులు వేచి ఉండే నారాయణగిరి షెడ్లలో ఆకతాయిల ప్రాంక్ వీడియోలు కలకలం రేపాయి. తమిళనాడుకు చెందిన టీటీఎఫ్ వాసన్, అతని మిత్రులు ప్రాంక్ వీడియోలు చిత్రీకరించారు. తరువాత ఆ వీడియోలను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసారు. ఈ నేపధ్యంలో తమిళనాడులో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. చివరకు టీటీడీ విజిలెన్స్ డిపార్ట్మెంట్ విచారణకు రంగంలోకి దిగింది.