విజయవాడ
చంద్రబాబు అండ్ కూటమి నెల పాలన గడిచింది. చంద్రబాబు ప్రకటించిన సూపర్ 6 లో మహిళలకు ఫ్రీ బస్ వాగ్దానం పై ఇంకా ఉలుకూ పలుకూ లేదని ఏపీసీసీ ఛీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. శుక్రవారం నాడు ఆమె మీడియాతో మాట్లాడారు. ఇది మంచి పథకం కాబట్టే తెలంగాణ కర్ణాటక ల్లో అమలవుతోంది. తెలంగాణ లో అధికారం లోకి వచ్చిన నెల లోపే..కర్ణాటక లో మూడో వారం లోపే ఈ పథకాన్ని కాంగ్రెస్ అమలు చేసిం. మహిళలకు రక్షణ ఆర్థిక వెసులుబాటు కలిగించే పథకం ఇది. ఈ చిన్న పథకాన్ని అమలు చేయడానికి చంద్రబాబు కు ఇంత టైం ఎందుకు పడుతుందో నాకు అర్ధం కావడం లేదు. దీన్లో విధి విధానాలు ఏముంటాయి ? తల్లికి వందనం వాగ్దానం అందరి పిల్లలకూ అన్నారు..కానీ జీవో లో మాత్రం ప్రతీ తల్లికీ 15000 అన్నారు. సాక్షి లో తల్లికి పంగనామం అని రాసింది . ఇంత అయోమయం ఎందుకు?? ప్రతీ తల్లి కే 15000 ఇస్తారా.. ప్రతీ బిడ్డ కూ 15000 ఇస్తారా... చంద్రబాబు క్లారిటీ ఇవ్వాలి. గతం లో జగన్ కూడా ఇలానే మోసం చేశారు. నాతో కూడా అప్పట్లో ఇలానే ఎంతమంది ఉంటే అంతమంది బిడ్డలకూ అంటూ జగన్ తప్పుడు ప్రచారం చేయించారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి టీడీపీ నేతలు పరస్పర విరుద్ధ ప్రకటనలు చేయిస్తున్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు కాప్టీవ్ మైన్ కేటాయించాలి .టీడీపీ వాళ్లు మోడీ నీ ఒప్పిస్తామంటున్నారు .ఒకవేళ ఆయన ఒప్పుకోకుంటే ఏం చేస్తారు. 10 ఏళ్లుగా ఏపీ నీ మోసం చేస్తున్న మోదీ మీద నమ్మకం ఉంది అని టీడీపీ వాళ్లు ఎలా అంటారు. మోడీ అంటేనే మోసం..ఏపీ కి పదేళ్లు గా వెన్నుపోటు పొడుస్తున్నారు మోదీ . వైజాగ్ స్టీల్ కోసం వైఎస్ఆర్ పాటు పడితే గత ఐదేళ్లు జగన్ దానికోసం ఎలాంటి చర్యా తీసుకోలేదు. చంద్రబాబు ఇప్పుడు అయోమయం ప్రకటనలు ఇప్పిస్తున్నారు. వైఎస్ఆర్ ఉమ్మడి ఏపీ నాయకుడి గా రెండు సార్లు ఎన్నుకోబడ్డారు..అలాంటి వ్యక్తి విగ్రహాలను టీడీపీ గూండాలు ధ్వంసం చేస్తున్నారు. వైఎస్ఆర్ వైసిపి నాయకుడు కాదు. వైసిపి కక్ష పూరిత చర్యలు చేసి ఉండొచ్చు . .మేము కాదనడం లేదు..కానే వైఎస్ఆర్ ను దానికి బాద్యుడి నీ చేస్తే ఎలా ..? వైఎస్సార్ కాంగ్రెస్అంటే యువజన శ్రామిక రైతు పార్టీ ..వైఎస్ రాజశేఖర రెడ్డి పార్టీ కాదు... ఆయన కూ వైసిపి కూ ఎలాంటి సంబంధం లేదని అన్నారు.