YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఫైవ్ స్టార్ ను తలపిస్తున్న రైల్వే స్టేషన్

ఫైవ్ స్టార్ ను తలపిస్తున్న రైల్వే స్టేషన్

హైదరాబాద్, జూలై 15 
ఇండియన్ రైల్వే దేశానికే తలమానికంగా నిలిచే సంస్థ. సామాన్యులకు తక్కవ ధరలోనే గమ్యస్థానానికి చేర్చే రైల్వే రవాణా మన జీవన విధానంలో ఓ భాగమైపోయింది. ప్రయాణికులను సకాలంలో గమ్యస్థానానికి చేరుస్తూ సర్వత్రా ప్రశంసలు అందుకుంటోంది. విశ్వనగరంగా పేరుగొంచిన హైదరాబాద్ నగరంలో మరో సరికొత్త ప్రాజెక్టు రూపుదాల్చబోతోంది. ఆ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే భాగ్యనగర వాసులకు నిజంగా పండుగే. అదే చర్లపల్లి రైల్వే టెర్మినల్..అంతర్జాతీయ ప్రమాణాలతో, అత్యాధునిక సౌకర్యాలతో దేశంలోని ఎయిర్ పోర్టులకు ఏ విధంగా తీసిపోని విధంగా నిర్మాణం పూర్తిచేసుకుని ప్రారంభోత్సవానికి సిద్ధమయింది.
చర్లపల్లి టెర్మినల్ తో సికింద్రాబాద్, కాచిగూడ , నాంపల్లి స్టేషన్లపై ప్రయాణికుల రద్దీని గణనీయంగా తగ్గించే అవకాశం ఉంది. రూ.434 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును అందుబాటులోకి తేనున్నారు. అన్నీ సవ్యంగా జరిగితే సార్వత్రిక ఎన్నికలకు ముందే ప్రారంభించవలసింది. అయితే ఎన్నికల కోడ్ దృష్ట్యా చాలా మటుకు పెండింగ్ పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఇప్పటికే 98 శాతం పూర్తయినట్లు రైల్వే అధికారులు చెబుతున్నారు. ఈ స్టేషన్ అందుబాటులోకి వచ్చాక ప్రతినిత్యం 50 రైళ్లు తిరిగేందుకు అవకాశం ఉంటుందంటున్నారు. అలాగే రోజుకు 25 వేల మంది ప్రయాణించేందుకు వీలుంటుంది. రానున్న రోజుల్లో రైళ్లు పెరిగే కొద్దీ ప్రయాణికుల సంఖ్య మరింత పెరగవచ్చని రైల్వే అధికారులు చెబుతున్నారు. ఇక్కడ కల్పించిన సదుపాయాలు చూస్తే షాకింగే.. ప్రయాణికుల సౌలభ్యం కోసం 9 ఎస్కలేటర్లు, 5 లిఫ్టులు కల్పించారు. అలాగే రెండు సబ్ వే లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చర్లపల్లి రైల్వే స్టేషన్ చుట్టుపక్కల రహదారులను విస్తరించారు. ఎంఎంటీఎస్ రైళ్లను అనుసంధానీకరించే ప్రక్రియను వేగవంతం చేశారు. చర్లపల్లి టెర్మినల్ భవనం మొదటి అంతస్థులో ఆడవారికి, మగవారికి వేర్వేరుగా విశ్రాంతి గదులు, క్యాంటీన్ సౌకర్యం ఏర్పాటు చేశారు. ఇక గ్రౌండ్ ఫ్లోర్ లో టికెట్ బుకింగ్ కౌంటర్లు ఆరు ఉన్నాయి. ప్రయాణికుల కోసం వెయిటింగ్ హాల్స్ ఏర్పాటు చేశారు. రెండు ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు కూడా ఉన్నాయి. 24 గంటలు సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. ప్రయాణికులు వాహనాలు నిలిపేందుకు అతి విశాలమైన పార్కింగ్ ప్లేస్ కూడా ఉంది. గోరఖ్ పూర్ టూ సికింద్రాబాద్, షాలిమార్ టూ సికింద్రాబాద్ ఈస్ట్ కోస్ట్ ఎక్స్ ప్రెస్, చెన్నై టూ నాంపల్లి చార్మినార్ ఎక్స్ ప్రెస్ రైళ్లను యుద్ధప్రాతిపదికన ప్రారంభించనున్నారు. త్వరలోనే మరిన్ని రైళ్లు ఇక్కడ హాల్టింగ్ కోసం ఆగనున్నాయి. శాతవాహన ఎక్స్ ప్రెస్, సిర్పూర్ కాగజ్ నగర్ ఎక్స్ ప్రెస్, గోల్కొండ ఎక్స్ ప్రెస్, తదితర రైళ్లు ఇప్పటికే హాల్డింగ్ పాయింట్ కింద నిలుపుతున్నారు రైల్వే అధికారులు. త్వరలోనే ప్రధాని మోదీ త్వరలో చర్లపల్లి టెర్మినల్ ను ప్రారంభించనున్నారు.

Related Posts