YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

డ్రగ్స్ అరికట్టేందుకు ప్లాన్

డ్రగ్స్ అరికట్టేందుకు ప్లాన్

హైదరాబాద్, జూలై 15 
రాష్ట్రంలో డ్రగ్స్ ను అరికట్టేందుకు ప్రభుత్వం సరికొత్త వ్యూహంతో ముందుకు వెళ్తోంది. రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ హైస్కూళ్లల్లో ప్రహరీ క్లబ్ లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. పాఠశాలలు, పిల్లల సంరక్షణ కేంద్రాల పరిసరాల్లో మాదకద్రవ్యాల విక్రయాలు జరగకుండా, విద్యార్థులు వాటి బారిన పడకుండా ప్రహరీ క్లబ్ లు నిఘా పెట్టనున్నాయి. ఇందుకు సంబంధించి విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి బుర్రా వెంకటేశం ఆదేశాలు జారీ చేశారు. పిల్లలను మాదకద్రవ్యాల దుర్వినియోగం నుంచి దూరం చేయడానికి ప్రహరీ క్లబ్ లను ఏర్పాటు చేయనున్నారు.పాఠశాలల్లో ప్రహరీ క్లబ్ అధ్యక్షుడిగా హెడ్ మాస్టర్ లేదా ప్రిన్సిపాల్ ఉండనున్నాడు. వైస్ ప్రెసిడెంట్ గా సీనియర్ టీచర్ లేదా ఫ్రెండ్లీ టీచర్ ఉంటారు. 6 నుంచి పదో తరగతి వరకు ప్రతి క్లాసులో ఇద్దరు విద్యార్థులు, స్థానికంగా ఉండే పోలీస్ స్టేషన్ నుంచి ఒక పోలీస్.. పేరెంట్స్ నుంచి ఒకరు ప్రహరీ క్లబ్ లో సభ్యులుగా ఉండనున్నారు. విద్య సంస్థల్లోకి మత్తు పదార్థాలు చేరకుండా, విద్యార్థులు వాటి ఊబిలో చిక్కుకోకుండా అవసరమైన ప్రణాళికలను ప్రహరీ క్లబ్ లు రూపొందిస్తాయి.ప్రస్తుతానికి హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ఈ ప్రహరీ క్లబ్ లను ఏర్పాటు చేయనున్నారు. దీనికి సంబంధించిన పూర్తి గైడ్ లైన్స్ ను ప్రభుత్వం త్వరలోనే విడుదల చేయనున్నది.

Related Posts