పల్నాడు
పల్నాడు జిల్లా ఎస్పిగా కె.శ్రీనివాసరావు సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ చరిత్రాత్మకమైన పల్నాడు జిల్లాకు రావడం సంతోషం. ఎన్నికల తరువాత పల్నాడులో అనేక సమస్యలు వచ్చాయి. నేను కూడా జిల్లాలోని పరిస్థితులను తొందరగా అవగాహన చేసుకుని చట్టపరంగా అన్ని సమస్యలు పరిష్కరిస్తాను. చట్టవ్యతిరేకమైన చర్యలకు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకుంటాము, జిల్లాలో తప్పుడు కేసులు బనాయించకుండా చూసేoదుకు కృషి చేస్తా. ముఖ్యంగా జిల్లాలో మహిళలకు రక్షణ కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటాo. యాంటీ డ్రగ్స్ పై జిల్లాలో 100 రోజులు క్యాంపెన్ చేస్తామని అన్నారు.
గంజాయి విక్రయాలు జరగకుండా అన్ని చర్యలు చేపట్టడం జరుగుతుంది. అసాంఘిక కార్యకలాపాలు జరిగితే వాటిని ఆధారాలతో అవసరమైతే ఇతర శాఖలతో కలిసి ముందు వెళ్లి చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. ఏ సమస్యలు ఉన్నా ప్రజలు తమ వద్దకు వచ్చి నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. ప్రజలు అనవసరమైన ఘర్షణలకు పాల్పడి తమ జీవితాలు నాశనం చేసుకోవద్దు. పల్నాడు పోలీసులు ప్రజల సేవలు కోసం సిద్ధంగా ఉన్నామని అన్నారు.