YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

భారీగా డ్రగ్స్ పట్టివేత అరెస్టైన వారిలో రకుల్ బ్రదర్

భారీగా డ్రగ్స్ పట్టివేత అరెస్టైన వారిలో రకుల్ బ్రదర్

హైదరాబాద్, జూలై 15
హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపాయి. సైబరాబాద్ పరిధిలో సోమవారం భారీగా డ్రగ్స్ సీజ్ చేశారు. ఐదుగురు నైజీరియన్లను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 200 గ్రాముల పైచిలుకు కొకైన్ ను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. నార్కోటిక్ బ్యూరో, రాజేంద్రనగర్ పోలీసులు, ఎస్.ఓ.టి, ఉమ్మడి ఆపరేషన్ నిర్వహించి డ్రగ్స్ విక్రయిస్తున్న వారితో పాటు కొనుగోలు చేస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు.టాలీవుడ్ కి చెందిన ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్  సింగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది. దాంతో టాలీవుడ్‌కు, డ్రగ్స్ కు లింక్స్ అని హాట్ టాపిక్ అవుతోంది. నైజీరియన్ల నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసిన వారిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేపట్టారు. వీరిలో సినీ ప్రముఖులకు సంబంధించిన వారితో పాటు పలువురు వ్యాపారవేత్తల్ని పోలీసులు అరెస్ట్ చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. రాజేంద్రనగర్ పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి వివరాలు వెల్లడించానున్నారు. దాంతో డ్రగ్స్ కేసులో నిందితుల వివరాలపై క్లారిటీ రానుంది.

Related Posts