YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఆరాధ్యను డామినేట్ చేస్తున్న సితార

ఆరాధ్యను డామినేట్ చేస్తున్న సితార

హైదరాబాద్, జూలై 15
మహేష్ బాబు కూతురు సితార.. ఐశ్వర్యరాయ్ కూతురుని డామినేట్ చేసిందన్న న్యూస్ సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఇది హాట్ టాపిక్ గా మారింది. నమ్రత, సితార మ్యాచింగ్ సిల్వర్ కలర్ షరరా డ్రెస్సులు ధరించారు. కాగా పదుల సంఖ్యలో స్టార్స్ పాలొన్న అనంత్ అంబానీ పెళ్లి వేడుకలో నటులు, సెలెబ్స్ మధ్య మాటలు, పలకరింపులు చోటు చేసుకున్నాయి. ఒకరితో ఒకరు ఫోటోలు దిగారు. సెల్ఫీలకు ఫోజిలిచ్చారు.మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్, ఆమె కూతురు ఆరాధ్యలను సితార, నమ్రత కలిశారు.ఈ క్రమంలో సితార వారితో సెల్ఫీ దిగింది. సితార సెల్ఫీ తీయగా నమ్రత, ఐశ్వర్య, ఆరాధ్య ఫోజిచ్చారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆరాధ్యను సితార డామినేట్ చేసింది. అందంలో సితారదే పై చేయి అంటూ కొందరు నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అందానికి చిరునామాగా చెప్పుకునే ఐశ్యర్య కూతురినే డామినేట్ చేసిన సితార గ్రేట్ అంటున్నారు.మహేష్ బాబు కూతురిగానే కాకుండా తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ డెవలప్ చేసుకుంది సితార. ఇంస్టాగ్రామ్ లో సితారను లక్షల మంది ఫాలో అవుతున్నారు. ఈ హీరోయిన్ రేంజ్ పాపులారిటీ ఆమె మైంటైన్ చేస్తుంది. 12 ఏళ్ల ప్రాయంలోనే సితార ఓ బ్రాండ్ కి అంబాసిడర్ గా చేసింది. తన ఫస్ట్ యాడ్ కి సితార రూ. 1 కోటి రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం. మొదటి సంపాదన సితార ఛారిటీకి ఖర్చు చేసిందట.టీనేజ్ కూడా దాటకుండానే సితార కోట్లు సంపాదించడం విశేషం. సితారకు నటి కావాలనే కోరిక గట్టిగా ఉంది. అందుకే ఇప్పటి నుండే సన్నద్ధం అవుతుంది. డాన్స్ లో శిక్షణ తీసుకుంటుంది. సితార ఇంస్టాగ్రామ్ పోస్ట్స్ తరచుగా వైరల్ అవుతూ ఉంటాయి..

Related Posts