YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

వైసీపీ నేతలు.. ప్రత్యర్ధులే... శత్రువులు కాదు పార్టీ ప్రజాప్రతినిధులతో పవన్

వైసీపీ నేతలు.. ప్రత్యర్ధులే... శత్రువులు కాదు పార్టీ ప్రజాప్రతినిధులతో పవన్

విజయవాడ, జూలై 15
వైసీపీ నేతలు తమకు ప్రత్యర్థులే తప్ప శత్రువులు కాదని జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఎవరిపైనా కక్షసాధింపు చర్యలకు పాల్పడొద్దని పార్టీ నేతలకు సూచించారు. అవినీతికి పాల్పడిన వారి విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. పార్టీ నేతలెవరూ ప్రభుత్వ కార్యక్రమాల్లో కుటుంబాలను ప్రొత్సహించవద్దన్నారు పవన్ కల్యాణ్‌. అధికార దుర్వినియోగానికి పాల్పడితే సహించేది లేదన్నారు. క్రమశిక్షణ ఉల్లంఘించిన నేతలను వదులుకోవడానికి కూడా తాను సిద్ధమని స్పష్టంచేశారు. ప్రభుత్వంపై అందరికీ నమ్మకం కలిగించాల్సి ఉందని.. ఏపీ సీఎం చంద్రబాబు నాలుగు దశాబ్దాల అనుభవం రాష్ట్రానికి ఎంతో అవసరమని మరోసారి వివరించారు. పార్టీ కోసం కష్టపడిన వారిని తాను మర్చిపోనని అన్నారు. అయితే నామినేటేడ్ పోస్టులను టీడీపీ, బీజేపీతో కలిసి పంచుకోవాల్సి ఉంటుందని చెప్పారు. ఈ విషయాన్ని నేతలు అర్థం చేసుకోవాలని సూచించారు. సోమవారం ప్రజాప్రతినిధులను సత్కరించిన పవన్‌ కల్యాణ్‌.. ప్రత్యేకంగా మాట్లాడారు. ఇది కూటమి విజయమని.. కూటమి పార్టీలో ఎవరినీ కించపరచొద్దన్నారు. సమస్యలు ఉంటే కూర్చుని మాట్లాడుకుందామన్నారు. కుటుంబ రాజకీయాలు వద్దు.. వారసులను తేవొద్దు.. వారసులు వస్తే కొత్త నాయకత్వం ఎలా వస్తుందంటూ పవన్‌ పేర్కొన్నారు. క్రమశిక్షణారాహిత్యంతో తనకు తలపోటు తీసుకురావద్దని సూచించారు. ప్రభుత్వ కార్యక్రమాలకు కుటుంబసభ్యులను పిలవొద్దని .. పదవులు ఉన్నా లేకున్నా పనిచేయాలని పవన్‌కల్యాణ్‌ తెలిపారు.164 సీట్లు గెలవడానికి తాము తీసుకున్న 21 సీట్లు వెన్నెముక అంటూ జనసేన నేతలకు పవన్ కల్యాణ్ వివరించారు. ప్రజలు ఇచ్చిన సత్కారం కంటే ఇది గొప్పది కాదన్నారు. పోటీ చేసిన ప్రతి సీటు గెలిచాం.. భారతదేశంలో ఇది ఎక్కడ జరగలేదు.. మనమే ఒక కేస్ స్టడీ అంటూ పేర్కొన్నారు. ఒకప్పుడు మన వేదిక చాలా పెద్దగా అనిపించేది..కానీ మన గెలుపుతో ఇప్పుడు చిన్నది అయిపోయిందన్నారు. మనం తిన్న దెబ్బలు ఎవరు తిన్నా పక్షం రోజులు కూడా ఉండలేరన్నారు. ఓడిపోయిన ముఖ్యమంత్రి అసెంబ్లీలో కూడా లేకుండా వెళ్లిపోయారు. ఒక సీట్ అన్న వస్తే చాలు అనుకున్న మనం నూటికి నూరు శాతం స్ట్రైక్ రేట్ కొట్టామని తెలిపారు. తాము సాధించిన విజయం చెప్పడం కూడా అవసరమేనని.. మార్పు కోరుకుంటే ప్రజల రోడ్లపైకి వస్తారన్నారు. కేసులు పెట్టారు బూతులు తిట్టారు వ్యక్తిగతంగా హింసకు పాల్పడ్డారని.. చంద్రబాబును కూడా జైల్లో పెట్టారని.. ఇలాంటి పరిస్థితిలో ధైర్యంగా నిలబడి.. జనాల్లో ధైర్యం నింపామన్నారు. జన సైనికులు, నేతలు, వీర మహిళల వల్లే ఇది సాధ్యమైందన్నారు. తాము పోటీ చేయని చోట కూడా జనసైనికులు అండగా నిలబడ్డారని.. అందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలిపారు.

Related Posts