YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఇండియాలోనే ఆత్మహత్యలు అధికం

ఇండియాలోనే ఆత్మహత్యలు అధికం

న్యూ ఢిల్లీ జూలై 16
 కాలం మారింది. మనుషులు కూడా చేంజ్ అయ్యారు. ఒకప్పటిలా పరిస్థితులు లేవు. పని అంత కన్నా లేదు. ఆర్ధిక సమస్యలు ఎక్కువే. భార్య భర్తల మధ్య సంబంధాలు కూడా బాగో లేవు. ఆరోగ్యం గురించి చెప్పక్కర్లేదు. పై నాలుగు కారణాల వల్ల కొందరు ఆత్మహత్యే శరణ్యం అంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఆత్మహత్యలకు సంబంధించిన డేటాను నేషనల్ క్రైమ్ బ్యూరో విడుదల చేసింది. డేటాలో భారతదేశంలో అత్యధిక మంది ఆత్మహత్య చేసుకున్నారనే కఠోర నిజం.
చిన్న పెద్ద అనే తేడా లేదు. అనారోగ్య సమస్య వచ్చిందా..? చాలు అంతే.. కొందరు కఠినమైన నిర్ణయం తీసుకునేందుకు వెనకాడటం లేదు. 2022లో ప్రపంచవ్యాప్తంగా 1.71 లక్షల మంది చనిపోయారు. భారతదేశం నుంచి అత్యధికంగా మంది ఉన్నారు. దేశంలో లక్ష మందికి 12.4 నలుగురు చొప్పున చనిపోయారనే కఠోర సత్యం తెలిసింది. డిప్రెషన్ వల్ల కొందరు క్షణికావేశంలో చనిపోవాలనే నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలిసింది. కొందరిలో జన్యుపరంగా ఇలా వస్తోండగా.. మరికొందరు ఒత్తిడితో నిర్ణయం తీసుకుంటున్నారని తెలిసింది.
డిప్రెషన్తోనే..!!
'ఆత్మహత్య చేసుకునేందుకు సాధారణ కారణం డిప్రెషన్, ఒత్తిడి వల్లే కఠినమైన నిర్ణయం తీసుకోవడానికి ఏ మాత్రంఅలోచించడం లేదు. పని ఒత్తిది, ఆర్ధిక సమస్యలు, భార్య భర్తల మధ్య అన్యోన్యత లోపించడం, ఆరోగ్య సమస్యల వల్ల సూసైడ్ చేసుకుంటున్నారు అని' సర్ గంగారం ఆస్పత్రిలో సైకియాట్రీ వైద్యులు రాజీవ్ మెహతా చెబుతున్నారు. పై నాలుగు సమస్యల వల్ల ఒత్తిడి పెరుగుతుంది. ఆందోళననిరాశగా రూపాంతరం చెందుతుంది. క్రమంగా ఆత్మహత్యకు దారితీస్తుందని వివరించారు. సూసైడ్ చేసుకునే వారిలో 50 నుంచి 90 శాతం మంది ఒత్తిడి, డిప్రెషన్, బైపోలార్ డిజార్డర్ వంటి మానసిక వ్యాధులతో బాధ పడుతున్నారని పలు అధ్యయనాలు నివేదిస్తున్నాయి.

Related Posts