YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

వర్షాలకు కుంగిపోయిన రోడ్డు

వర్షాలకు కుంగిపోయిన రోడ్డు

మేడ్చల్
ఉప్పల్ లోని హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారిలోని (ఉప్పల్ నారపల్లి ఎలివెటెడ్ కారిడార్) రెండు పిల్లర్ల పక్కన రోడ్డు కుంగిపోయింది.
వర్షానికి ఎలివేటెడ్ కారిడార్ పిల్లర్ల వద్ద  రాత్రి కృంగి ప్రమాద కరంగా మారింది. పిల్లర్ చుట్టూ వర్షం దాటికి మట్టి భూమిలోకి కూరుకుపోవడంతో గుంతలుగా చీరికలు వచ్చాయి. ఈ చిన్నపాటి వర్షానికి పిల్లర్ల సైడు భూమి కుచించుకపోవడం, ఎలివేషన్ పూర్తయిన తర్వాత ఇదే పరిస్థితి ఉంటే ఎలివేటెడ్ కారిడార్ ఫ్లైఓవర్ కూలే అవకాశం ఉందని స్థానికులు అంటున్నారు. నాణ్యత లేని పనులు ఇలాంటి సంఘటనలకు కారణం అంటున్నారు. ఉదయం ఒక కారు గుంతలో పడింది, తృటిలో ప్రమాదం తప్పింది.

Related Posts