YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

సింగిల్ డిజిట్ కే బిఆర్ఎస్ పరిమతం కనున్నదా?

సింగిల్ డిజిట్ కే బిఆర్ఎస్ పరిమతం కనున్నదా?

హైదరాబాద్ జూలై  16
కేసీఆర్ అధికారంలో ఉన్న పదేళ్లలో నాటి తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల ఎల్ పీలను విలీనం చేసుకున్న విధంగానే.. ఇప్పుడు బీఆర్ఎస్ వంతు వచ్చింది. పార్టీలో ఉన్న నేతలను కాపాడుకోలేక.. అధికార పార్టీని ఏమీ చేయలేక... తాను తీసుకున్న గోతిలో తానే పడినట్లుగా గులాబీ పరిస్థితి మారింది. ఎంఎల్ఎల జంపింగ్ లతో గులాబీ పార్టీ త్వరలోనే సింగిల్ డిజిట్ కు పరిమిత పరిమితమయ్యే అవకాశముందన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. దీంతో గులాబీ పార్టీ ప్రతిపక్ష స్థానాన్ని కోల్పోయి ప్రమాదం కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తోంది. ఇదే జరిగితే కేసీఆర్ భారీ మూల్యం చెల్లించుకున్నట్లే అవుతుందన్న వాదన రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో రాష్ట్రంలో అసలు ప్రతిపక్షం అంటూ లేకుంటా చేయాలన్న కేసీఆర్ ఆలోచనే..... ప్రస్తుతం గులాబీ పార్టీకి శాపంగా మారిందని తెలుస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ పెట్టిన ఇబ్బందులకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వడ్డీతో సహ చెల్లించాలన్న కృత నిశ్చయంతో ఉంది. ఇందులో భాగంగానే గులాబీ పార్టీ కి చెందిన శాసనసభ, శాసనమండలి సభ్యులు ఒక్కొక్కరుగా కాంగ్రెస్ లో చేర్చు కుంటున్నారు. ఇప్పటికే పది మంది. శాసనసభ్యులను, ఆరుగురు ఎంఎల్ సీలను అధికార పార్టీ చేర్చుకుంది. మిగిలిన వారు కూడా అదే దారిలో ఉన్నారు. త్వరలోనే వారంతా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం ఖాయమన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయినప్పటికీ గులాబీ బాస్ కేసీఆర్ వారిని కాపాడుకోలేక ......చేజారిపోతున్నా వారిని నిలువరించలేని నిస్సహాయ స్థితికి చేరుకున్నారని తెలుస్తోంది
బీజేపీ.. ప్రతిపక్ష హోదాలోకి రాబోతుందనే చర్చ ...
అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ నెలాఖరు నాటికి బీఆర్ఎస్ లెక్కలు పూర్తిగా తారుమారు కానున్నాయని తెలుస్తోంది. రాష్ట్రంలో అతి పెద్ద ఉద్యమపార్టీగా ఆవిర్భవించిన గులాబీ పార్టీ ఇక మూడో స్థానానికి వడిపోతుందనే వార్తలు గుప్పుమంటున్నాయి. ఇకచరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా కారు పార్టీ.. గతలోక్సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా దక్కించుకోలేకపోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని చవిచూసినప్పటికీ 39 సీట్లను గెలుచుకున్న గులాబీ పార్టీ కేవలం మూడు నెలల వ్యవధిలో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో పరిస్థితి పూర్తిగా దిగజారింది. కారు పార్టీకి ఒక్క సీటు కూడా రాకపోగా.... సుమారు పది నియోజకవర్గంలో ఆ పార్టీ డిపాజిట్లను సైతం కోల్పోయింది. ఇక పదిహేను లోక్ సభ సెగ్మెంట్లలో గులాబీ పార్టీ అభ్యర్ధులు మూడవ స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ పరిణామంలతో పార్టీ భవిష్యత్తుపై నేతల్లో ఆందోళన నెలకొంది. ఇందులో భాగంగానే గులాబీ నేతలంతా ఒక్కొక్కరుగా చేజారుతున్నారు. అయినప్పటికీ కేసీఆర్ కాపాడుకోలేకపోతున్నారు. పార్టీని వీడనున్నారని ప్రచారం సాగుతున్న నేతలను పిలుపించుకుని కేసీఆర్ చర్చలు జరుపుతున్నప్పటికీ...ఆ మార్నాడే సదరు నేతలు పార్టీని వీడుతున్నారు. ఈ ఘటనలు చూసి కేసీఆర్ అసహనంతో రగిలిపోతున్నారు. అంతర్గతంగా కుమిలిపోతున్నారు. అయినప్పటికీ ఆయనఫామ్ హౌస్ దాటలేక పోతున్నారంటూ ఆయనపై సొంతపార్టీ నేతలే తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. పార్టీ పతనం గురించి కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్నా.. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అండ్ కో నోరు విప్పిన పాపాన పోలేదు. ఓటమి తర్వాత కుంగిపోయి.. కుమిలిపోతున్నారే తప్ప.. నేతలను కాపాడుకునే ప్రయత్నాలు చేయటం లేదనే టాక్ నడుస్తోంది. కాంగ్రెస్ కంటే కేవలం 1.8 శాతం ఓట్లు మాత్రమే తక్కువగా వచ్చాయని.. కేసీఆర్, కేటీఆర్, హరీష్రవు అనేక సార్లు కామెంట్ చేశారు. రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షంగా వ్యవహరిస్తామని.. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని చెప్పుకుంటూ వచ్చారు. అదే సమయంలో రేవంత్ సర్కార్ పై కేటీఆర్, హరీశ్ రావులు విమర్శలు గుప్పిస్తున్నప్పటికీ కేసీఆర్ మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. ఇది కూడా గులాబీ నేతలకు అంతగా రుచించడం లేదు. దీని కారణంగా పార్టీ మారాలని భావిస్తున్న గులాబీ నేతలకు వారిని మరింత స్వేచ్ఛ వచ్చిందనే వాదనలూ ఉన్నాయి. ఈ విషయాన్ని గ్రహించి వారితో రహస్య మంతనాలతో పాటు బుజ్జగింపులు చేస్తున్నా.. పార్టీలో కొనసాగేందుకు నేతలు ఆసక్తి చూపటం లేదనే వార్తలు గుప్పుమంటున్నాయి. ఫలితంగా కడియం శ్రీహరితో మొదలైన వలసలు.. తెల్లం వెంకట్రావు, దానం నాగేందర్, పోచారం శ్రీనివాసరెడ్డి, కాలె యాదయ్య, తాజాగాగూడెం మహిపాల్ రెడ్డి చేరిక దాకా చేరింది. మరికొందరు నేతలు కూడా హస్తం గూటికి చేరతారనే ప్రచారం సాగుతోంది. దీంతో ఈ నెల చివరి వారంలో ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాల నాటికి బీఆర్ఎస్ఎల్సీ కాంగ్రెస్లో విలీనం దిశగా పరిణామాలు మారుతున్నాయి. ఇటీవల జరుగుతున్న ఘటనలే దీనికి నిదర్శంగా కనిపిస్తోంది.
 ప్రతిపక్ష హెూదాపై బీజీపీ కన్ను..
రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా పై బీజేపీ కన్నువేసినట్లుగా తెలుస్తోంది. ఈ నెలాఖరు కల్లా బీజేపీ కనీసంగా 12 సీట్లతో ప్రధానప్రతిపక్షంగా గుర్తింపు పొందనున్నదనే మాటలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం బీజేపీకి ఎనిమిది మంది శాసనసభ్యులున్నారు. బీజేపీతో టచ్ లో ఉన్న వారు చేరితే ప్రధాన పక్ష హెూదాను ఆ పార్టీ సునాయాసంగా చేజిక్కించుకునే అవకాశం ఉంది. కానీ ఇప్పటివరకూ ఒక్క ఎమ్మెల్యే కూడా బీజేపీ కార్యాలయం ఎక్కిన సందర్భాలు లేవు. నలుగురు ఐదుగురు గులాబీ ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారని ఏలేటి మహేశ్వర్రెడ్డి చెబుతున్నారు. ఒక అడుగు ముందుకు వేసిన కేంద్రమంత్రి బండి సంజయ్.. ఏకంగా 26 మంది తమతో టచ్లో ఉన్నారని చెప్పుకొస్తున్నారు. ఇలా ఎవరికి వారే నేతలంతా మాతో టచ్లో ఉన్నారని లెక్కలు మాత్రం చెబుతున్నారు. కానీ.. చేరే వాళ్లు ఎవరు అనేది ప్రశ్నార్ధకంగా మారింది. మరోవైపు పార్టీలో చేర్చుకోడానికి వ్యతిరేకం కాదంటున్నారు కమలం పార్టీ నేతలు.. ఎవరైనా బీజేపీలోకి రావాలంటే తమ పదవికి రాజీనామా చేయాలని కండీషన్ పెట్టేశారు. అయినా ఐదారుగురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకు ఇప్పటికే ఢిల్లీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్టుగా ప్రచారం సాగుతోంది. ఎవరైతే విచారణ సంస్థల్లో చిక్కుకున్న గులాబీ ఎమ్మెల్యేలు బీజేపీ వైపు చూస్తున్నారని సమాచారం, ఇలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్లో చేరేందుకే ఎక్కువ అవకాశం ఉందని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. తమ నియోజకవర్గాల్లో ఈక్వేషన్స్ కుదరక కొందరు.. ఈడీ, సీబీఐ, ఐటీ విచారణలు ఎదురుకుంటున్న వారంతా బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. కనీసం నలుగురైనా బీజేపీలో చేరుతారని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అప్పుడే ప్రధాన ప్రతిపక్ష హెూదాదక్కడానికి వీలు ఉంటుందని కమలం పార్టీ భావిస్తోంది.

Related Posts