YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

అధికారులు అప్రమత్తంగా ఉండాలి మంత్రి పొన్నం ప్రభాకర్

అధికారులు అప్రమత్తంగా ఉండాలి  మంత్రి పొన్నం ప్రభాకర్

హైదరాబాద్
హైదరాబాద్ లో ఈ సాయంత్రం నుండి భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనలతో జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఎ , వాటర్ వర్క్స్ , డిఆర్ఎఫ్ , ఎన్డిఆర్ఎఫ్ బృందాలు ఇతర విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. హైదరాబాద్ లో భారీ వర్షాలు కురిస్తే లోతట్టు ప్రాంతాల్లో ఇబ్బందులు లేకుండా ఉండడం , ప్రాణ నష్టం జరగకుండా చూసుకోవాలని అధికారులకు తెలిపారు... హైదరాబాద్ లో భారీ వర్షం కురిసినప్పుడు నీళ్ళు నిల్వ ఉండే 141 వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద జీహెచ్ఎంసీ సిబ్బంది ఉండి నీళ్ళు వెంటనే వెళ్ళేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఎక్కడైతే వర్షం కురిసి ఇబ్బందులు ఉన్నాయో ఆయా ప్రాంతాల్లో అధికారులకు ప్రజలు పిర్యాదు చేసిన వెంటనే స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు.. వర్షం కురిసిన సమయంలో లోతట్టు ప్రాంతాలు వారిని అప్రమత్తం చేయాలి. పాత భవనాల వద్ద ఉన్నవారిని ఖాళీ చేపించాలి. గతంలో జరిగిన ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలి.వర్షాలు కురిసినపుడు విద్యుత్ స్థంబాల వద్ద ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విద్యుత్ అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. పోలీస్,జీహెచ్ఎంసీ , హెచ్ఎండిఎ వివిధ విభాగాల అధికారులు ప్రజలు ఇబ్బందులు కలగకుండా సమన్వయంతో పని చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు.

Related Posts