అనంతపురం, జూలై 17
అనంతపురం జిల్లా మొత్తంలో చక్రం తిప్పిన నాయకుడు మాజీ మంత్రి, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి.. జిల్లాలోని తాడిపత్రి నియోజకవర్గం నుంచి 1985 నుంచి దివాకర్ రెడ్డి వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. వైఎస్ కుటుంబంతో విభేదాల కారణంగా 2004లో గెలిచినా ఆ సీనియర్‌కు కేబినెట్ బెర్త్ దక్కలేదు. 2009లో వైఎస్ మరణాంతరం ఆయనకు కిరణ్ కేబినెట్ బెర్త్ దక్కింది. దివాకరరెడ్డి తమ్ముడు జేసీ ప్రభాకరరెడ్డి సైతం 1987 నుంచి తాడిపత్రి చైర్మన్‌గా మూడు సార్లు గెలిచి సత్తా చాటుకున్నారు.రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన జేసీ సోదరులకు చంద్రబాబునాయుడు సముచిత ప్రాధాన్యత ఇచ్చారు. 2014 ఎన్నికల్లో దివాకరరెడ్డి అనంతపురం ఎంపీగా గెలిస్తే.. ప్రభాకరరెడ్డి తాడిపత్రి నుంచి మొదటిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2019లో ఎన్నికల్లో జేసీ దివాకర్ రెడ్డి తనయుడు జెసి పవన్ రెడ్డి అనంతపురం ఎంపీగా, జేసీ ప్రభాకర్ రెడ్డి తనయుడు అస్మిత్ రెడ్డి తాడిపత్రి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఇద్దరు ఓటమి పాలయ్యారు. అయితే జేసీ ప్రభాకరరెడ్డి 2021లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసి వైసీపీ హవాలోనూ తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్‌గా ఎన్నికవ్వడం విశేషం.జేసీ బ్రదర్స్ ఏ పార్టీలో ఉన్నా వార స్టైల్ డిఫరెంట్‌గా వుంటుంది. సహజంగా రాజకీయ నాయకులు ఏది మాట్లాడినా చాలా జాగ్రత్తగా మాట్లాడుతారు. తమ అభిప్రాయలు డైరెక్ట్ గా ఎక్స్‌ప్రెస్ చేయరు. కాని జేసీ బ్రదర్స్ మాత్రం తన అభిప్రాయలు నిర్మొహమాటంగా చెప్పేస్తారు. దేనికి భయపడరు. కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడేస్తారు. మనస్సుకు అనిపించింది మీడియా ముందే చెప్పేస్తారు. దాంతో వైసీపీ ప్రభుత్వ హయాంలో అనేక సమస్యలు, కేసులు ఎదుర్కొన్నారు. వారి ట్రావెల్స్ బస్సులు సీజ్ చేసి వైసీపీ ప్రభుత్వం తీవ్ర ఇబ్బందుకు గురి చేసింది. అయినా వారు తమ స్టైల్ మార్చుకోలేదు.ఆ క్రమంలో మొన్నటి ఎన్నికల్లో ఉమ్మడి అనంత జిల్లాల్లో టీడీపీ క్లీన్‌స్వీప్ చేసింది. జేసీ అస్మిత్ రెడ్డి తాడిపత్రిలో మంచి మెజార్టీతో గెలుపొందారు. దాదాపు 27 వేల పైచిలుకు ఓట్ల తేడాతో కేతిరెడ్డి పెద్దారెడ్డిపై విజయం సాధించారు. అప్పట్లో అనంతపురం ఎంపీ స్థానం నుంచి జెసి పవన్ కుమార్ రెడ్డి పోటీ చేస్తాడని భారీ ఎత్తున టాక్ నడిచింది. దానికి తగ్గట్టుగానే పవన్ రెడ్డి కూడా మరోసారి పోటి చేసేందుకు ఆసక్తి గా ఉండడంతో ఆ యువనేతకే టికెట్ ద్కతుందని జోరుగా ప్రచారం నడిచింది.కానీ చివరి నిమిషంలో సామాజిక సమీకరణలు దివాకరరెడ్డి వారసుడికి కలిసి రాలేదు. పవన్ టికెట్ త్యాగం చేసి అనంతపురం పార్లమెంట్ స్థానంలో టీడీసీ గెలుపొందడానికి కృషి చేశారు. దాంతో అనంతపురం ఎంపీగా టీడీపీ అభ్యర్ధి అంబికా లక్ష్మీనారాయణ గెలుపొందారు. ఈ మెజార్టీ వెనుక జేసీ ఫ్యామిలీ పాత్ర ఉందనేది సుస్పష్టం. జిల్లాల్లో అంతటి ప్రాముఖ్యం ఉన్న కుటుంభం కావడంతో టీడిపి అధిష్టానం కూడ వారికి ఏంతో ప్రాముఖ్యాన్ని ఇస్తూ వచ్చింది. ఇక టీడిపి అధికారంలోకి వచ్చి నెల రోజులు దాటింది. నామినేటెడ్ పోస్టుల భర్తీకి కూడా సమయం ఆసన్నమైంది.జేసీ కుటుంబానికి నామినేటెడ్ పదవులపై ఆసక్తి లేనప్పటికీ టిడిపి అధిష్టానమే వారి కుటుంబానికి ఏదో ఒక పదవి ఇవ్వాలని భావిస్తుందట. దానికి తోడు గతంలో జేసీ పవన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఇక ఈ సారి కూడా అదే ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడి పదవీ ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. దానికి తోడు పవన్ రెడ్డి ఇటీవల నారా లోకేష్‌ని కలవడంతో ఆ ప్రచారం మరింత ఊపందుకుంది.తాజాగా మంగళగిరిలోని నారా లోకేష్ క్యాంప్ ఆఫీస్‌లో లోకేష్‌ని పవన్ రెడ్డి కలవడంతో ఇప్పుడు మరోసారి ఆ చర్చ తెరపైకి వచ్చింది. కచ్చితంగా జేసీ పవన్ రెడ్డికి ఏదో ఒక పదవి ఇస్తారని ఒలంపిక్ అసోసియేషన్ అధ్యక్షునిగా ఛాన్స్ దక్కే అవకాశం ఉందంటూ జోరుగా ప్రచారం నడుస్తోంది. జేసీ పవన్ రెడ్డికి దేశంలో అనేకమంది క్రీడాకారులతో మంచి పరిచయాలు ఉండటంతో ఈ పదవిపై మరోసారి చర్చ మొదలైంది. జేసీ పవన్ రెడ్డికి క్రికెటర్లు ఎంఎస్ ధోని, సచిన్ టెండుల్కర్, బాలివుడ్ స్టార్ సల్మాన్‌ఖాన్ వంటి వీవీఐపీలతో స్నేహం ఉంది. ధోని హైదరాబాద్ ఎప్పుడు వచ్చినా కూడా జెసి పవన్ రెడ్డి ఇంట్లో బస చేస్తారు. అలాంటి పవన్ సేవలను వాడుకోవడానికి టీడీపీ ఖచ్చితంగా ఆయనకు సముచిత స్థానం కల్పిస్తుందన్న టాక్ వినిపిస్తుంది.