YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

హస్తకళలకు ప్రోత్సాహం మంత్రి పొన్నం

హస్తకళలకు ప్రోత్సాహం మంత్రి పొన్నం

హైదరాబాద్
ముషీరాబాద్ లోని హస్తకళా భవన్ లో హ్యాండ్ క్రాఫ్ట్స్  డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నాయడు సత్యనారాయణ గౌడ్  ప్రమాణ స్వీకార కార్యక్రమంలో  రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గోన్నారు.
మంత్రి మాట్లాడుతూ హస్తకళల కార్పోరేషన్ 2013  లో ఏర్పడినప్పటికీ 2015 నుండి ఈ కార్యక్రమాన్ని  ప్రారంభించుకున్నాం. క్షేత్ర స్థాయిలో కళా నైపుణ్యం వారిని వృత్తులకు ప్రోత్సహిస్తూ వారికి మార్కెటింగ్ సౌకర్యానికి వేదికగా ఈ సంస్థ ముందుంది. 61 కోట్ల టర్నోవర్ చేస్తుంది. దానిని 600 కోట్ల టర్నోవర్ కి తీసుకుపోవాలి. ప్రభుత్వం అతిథులకు బయట దేశం, బయటి రాష్ట్రం నుండి వచ్చే అతిథులకు బహుమానాలు ఇస్తుంటారు. చేనేత వృత్తులకు ప్రోత్సహించడానికి చేనేత వస్త్రాలను  ప్రభుత్వం తరుపున వివిధ సంస్థలకు ఇవ్వడానికి జీవో నెంబర్ 1 ద్వారా టెస్కో ద్వారా కొనుగోలు చేస్తారు. ఇవి కూడా ముఖ్యమంత్రి ,ఆర్థిక మంత్రి మాట్లాడి హస్తకళలు  సంబంధించినవి వచ్చినప్పుడు ఈ కార్పోరేషన్ నుండి తయారు చేసినవి మాత్రమే కొనుగోలు చేసేలా జీవో తేవాలి. నేను కూడా సహకరిస్తా. ఈ పరిశ్రమ మార్కెట్ లో వందల కోట్ల టర్నోవర్ ఉంది
హస్తకళలు ఎక్కడికి వెళ్ళినా బహుమతి ఇచ్చే కార్యక్రమాలు జరుగుతున్నాయి. తెలంగాణ వృత్తి కళాకారుల ద్వారా చేనేత, హస్తకళల అనేక రకాల వస్తువులు కొనుగోలు చేసే విధంగా షోరూం లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం తరుపున హస్తకళలు, చేతి వృత్తులు, చేనేత కలలు ప్రోత్సాహం ఉంటుంది. ఈ సంస్థ మరింత ఎదగాలి. నాయుడు సత్యనారాయణ ఆధ్వర్యంలో మరింత ముందుకు పోవాలని అన్నారు.

Related Posts