YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం విదేశీయం

పాక్ ఆక్రమిత కశ్మీర్(పిఓకె) పై కన్నేసిన చైనా?

పాక్ ఆక్రమిత కశ్మీర్(పిఓకె) పై కన్నేసిన చైనా?

న్యూఢిల్లీ జూలై 17
తూర్పు లద్ధాఖ్ లో చైనా, భారత సైన్యం చేతిలో విఫలమయ్యాక, ఇప్పుడు పాక్ ఆక్రమిత కశ్మీర్(పిఓకె) పై కన్నేసింది. ఉపగ్రహ చిత్రం ద్వారా చైనా కజాకిస్థాన్ లో 13000 అడుగుల ఎత్తులో ఓ సైనిక స్థావరాన్ని ఏర్పరచుకుంటోందని స్పష్టమైంది. అది పాక్ ఆక్రమిత కశ్మీర్ కు అత్యంత సమీపంలో ఉంది. అయితే ఈ వార్తలను చైనా ఖండిస్తోంది.చైనాకు తన భూభాగాన్ని విస్తరించుకోవాలన్న కాంక్ష ఎక్కువ. ‘ద టెలిగ్రాఫ్’ రిపోర్టు ప్రకారం చైనా కజాకిస్థాన్ లో ఈ రహస్య సైనిక స్థావరాన్ని దశాబ్ద కాలంగా నిర్మిస్తోందని వార్త. కజాకిస్థాన్ ఇదివరకటి సోవియట్ నుంచి విడిపోయి స్వతంత్ర దేశంగా ఉంది.మీడియా రిపోర్టుల అనుసారం చైనా నిఘా టవర్ ను కూడా ఏర్పాటు చేసింది. అది ఆఫ్ఘనిస్థాన్ కు అత్యంత సమీపంలో ఉంది. దీనిని ‘కౌంటర్ టెర్రర్ బేస్’ రూపంలో 2021 లో నిర్మించారని ‘ఎకనామిక్ టైమ్స్’ పేర్కొంది. ప్రస్తుతం చైనా మధ్య ఆసియా ప్రాంతంలో పట్టును సాధిస్తోంది. కజాకిస్థాన్ లో చైనా సైనిక స్థావరం కేవలం సైనిక పరంగానే కాక, ప్రాంతీయ ప్రభావాన్ని చూపేదిగా ఉండనున్నది. చైనా తన ఇరుగుపొరుగు దేశాల భూభాగాలను ఆక్రమించుకుని విస్తరించాలని చూస్తోందన్నది యధార్థం.

Related Posts