YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కండువా మారిందోచ్...

కండువా మారిందోచ్...

మెదక్, జూలై 18,
బీఆర్ఎస్‌లో ప్రక్షాళన మొదలైందా? నేతలంతా పార్టీ విడిచి పోవడంతో గులాబీ నేత కేసీఆర్ ఆలోచనలో పడ్డారా? పార్టీ డౌన్‌ఫాల్‌కు కారణాలు వెతుకుతున్నారా? పార్టీకి మునుపటి ఫామ్ రావాలంటే పార్టీ పేరు నుంచి మార్పులు చేస్తున్నారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నా యి. తాజాగా రీసెంట్‌గా పటాన్‌చెరు‌లో మీటింగ్‌లో మాజీమంత్రి హరీష్‌రావు టీఆర్ఎస్ కండువాతో దర్శనమిచ్చారు. దీంతో బీఆర్ఎస్ పేరు కాస్త టీఆర్ఎస్‌గా మారిపోయిందనే ప్రచారం జోరుగా సాగుతోంది.బీఆర్ఎస్‌లో ప్రక్షాళన మొదలైంది. పార్టీకి పూర్వవైభవం సాధించేందుకు కేసీఆర్ తీవ్ర ప్రయత్నాలు చేస్తు న్నారు. తొలుత పార్టీ పేరు నుంచే మార్పుకు శ్రీకారం చుట్టునట్టు కనిపిస్తోంది. టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి. పార్టీ ప్రారంభం నుంచి ఇదే పేరుతో కంటిన్యూ అయ్యింది. రెండుసార్లు ఇదే పేరుతో అధికారంలోకి వచ్చింది ఆ పార్టీ.జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావించి టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా పేరు మార్చారు కేసీఆర్. పేరు మార్చిన మూడేళ్లకే రాష్ట్ర రాజకీయాలకు దూరమయ్యారు. చివరకు పార్టీ చతికిలపడిపోయింది. నేతలు వలసబాట పట్టారు. కవిత జైలు పాలుకాగా, కేసీఆర్‌‌ను వివిధ కమిషన్లు వెంటాడుతున్నాయి. బీఆర్ఎస్ తన అస్తిత్వం నిలబెట్టుకునేందుకు ఇప్పుడు పోరాడుతోంది.తెలంగాణ పేరుతో పుట్టిన పార్టీ.. తెలంగాణ అనే పేరు తొలగించగానే దాని కథ ముగిసింది. బీఆర్ఎస్ అంటే తెలంగాణతో బంధం తెగిపోయిందనే భావన నేపథ్యంలో మళ్లీ సెంటిమెంట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలో మార్పులు చేపట్టినట్టు తెలుస్తోంది. తాజాగా పటాన్‌చెరు పార్టీ కార్యకర్తల మీటింగ్‌లో మాజీమంత్రి హరీష్‌రావు టీఆర్ఎస్ కండువాతో దర్శన మిచ్చారు.ఆ పార్టీలో ఇది ఆసక్తికరంగా మారింది. పార్టీ పేరు మార్చాలనే హైకమాండ్ సూచన మేరకు ఆయన టీఆర్ఎస్ కండువా ధరించారా? బీఆర్ఎస్ కండువాలు లేకపోవడంతో దాన్ని వేసుకున్నారా? అన్న ప్రశ్నలు రైజ్ అవుతున్నాయి. టీఆర్ఎస్ కండువాతో హరీష్‌రావు కనిపించడం పెద్ద చర్చకు దారితీసింది. అయినా పేరు మార్చితే ఏముంటుందని, నేతల మనసు మారాలని అంటున్నవాళ్లూ ఆ పార్టీలో లేక పోలేదు.

Related Posts