YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

రుణమాఫీ ఫై స్పందించిన ఈటల రాజేందర్

రుణమాఫీ ఫై స్పందించిన ఈటల రాజేందర్

హైదరాబాద్
ఎన్నికలకు ముందు అన్ కండిషనల్ గా రెండు లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పావో అలానే చేయాలి తప్ప అనేక రకాల నిబంధనలు పెట్టి అందరిని ఎగరగొట్టే ప్రయత్నం చేయొద్దు. 34 వేల కోట్ల రుణమాఫీ చేయాల్సి ఉండగా  ఏదో ఐదు ఆరు వేలకోట్ల రూపాయలు ఇచ్చి దాన్ని పండుగలాగా, ఏదో చారిత్రాత్మక దినం లాగా వర్ణించే పిచ్చి ప్రయత్నం చేస్తున్నారు. భారతదేశంలో రుణాలు ఎగవేతకు గురైన రైతులు ఎక్కడున్నారంటే తెలంగాణలో  ఉన్నారు  అనే అపకీర్తి గత ప్రభుత్వం తెచ్చిపెట్టింది. ఇవ్వాలున్నటువంటి  ప్రభుత్వం భేషజాలకు పోకుండా అన్ కండీషనల్ గా రైతాంగానికి చెప్పిన విధంగా రుణమాఫీ చేసి,  రైతులను రుణవిముక్తులను చేయాలని డిమాండ్ చేస్తున్నానుని అన్నారు

Related Posts