YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

బిగ్ బాస్ సెలబ్రెటీలపై టెన్షన్

బిగ్ బాస్ సెలబ్రెటీలపై టెన్షన్
బుల్లితెర  పై అందరూ ఎప్పుడెప్పుడా అని   ఎదురు చూస్తున్న బిగ్ బాస్ సీజన్ 2  త్వరలో ప్రారంభం కాబోతుందన్న విషయం తెలిసిందే... హీరో నాని ఈ షోకి హోస్ట్ గా వ్వవహారిస్తున్నాడు. సీజన్ 1లో జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించి అదరగొట్టాడు. మరి ఇప్పుడు. నాని ఏ రేంజ్ లో  ఎన్టర్ టైన్ చేస్తాడో  వేచి చూడాలి.. సీజన్ 2లో బిగ్ బాస్ హౌస్ లో ఎవరెవరు ఉండబోతున్నార అన్నదాని పై ఓ లుక్ వేద్దాం.బిగ్ బాస్ సీజన్ 1  సూపర్ హిట్ అయింది.  జూనియర్ ఎన్టీఆర్ తనదైన యాటిట్యూడ్ తో హోస్ట్ గా వ్యవహరించి... ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.. సీజన్ 1 పూర్తే దాదాపు ఏడు నెలలు కావడంతో అభిమానులంతా  సీజన్ 2 కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ సారి బిగ్ బాస్ కు యాంకర్ గా హీరో నాని వ్యవహరించబోతున్నాడు.దీనికి సంభందించి  ఇప్పుటికే  రెండు ప్రోమోలను మా టీవీ విడుదల చేసింది.  `` ఈ సారి  ఇంకొంచెం  మసాల అంటూ``  నాని బిగ్ బాస్ 2 పై ఆసక్తిని పెంచేశాడు. 106 రోజులు...16మంది సెలబ్రెటీలు...70 కెమెరాలు ఒక బిగ్ హౌస్ తో బిగ్ బాస్ 2 ను నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి  అన్నపూర్ణ స్టూడియోస్ లో  బిగ్ బాస్ హౌస్  సెట్ ను నిర్మించారు. ఈ సారి బిగ్ బాస్ హౌస్ లో ఉండబోయే సెలబ్రెటీలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది... తాజాగా బిగ్ బాస్  సెలబ్రెటీల సమాచారం  నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. రాశి, గజాలా, చార్మీ, గీతా మాధురీ, యాంకర్ శ్యామల, లాశ్య , రిపోర్టర్ దీప్తీ, చాందినీ చౌదరీ, దన్య బాలకృష్ణ, జూనియర్ శ్రీదేవి, శ్రీ రెడ్డి,  వరుణ్ సందేశ్ , తనీష్, వైవా హర్ష, జబర్ దస్త్  వేణు, ఆర్ ఎన్ రాజేష్‌,  బిగ్ బాస్ లో  ఉండ బోతున్నట్లు సమాచారం...సీజన్ 1 లో 16 మంది పార్టీస్పెట్ చేయగా అందులో విజేతగా  హీరో శివ బాలాజీ నిలిచి 50 లక్షల ఫ్రైజ్ మనీని సొంతం చేసుకున్నాడు.. ఈ సారి  సీజన్2 లో ఎవరు విజేతగా నిలవనున్నారు...? ఎంత ఫ్రైజ్ మనీ గెలుచు కోనున్నారని అందరిలో ఆసక్తి నెలకొంది.  సీజన్ 1 కంటే బిగ్ బాస్ 2 మరింత వినోదాన్ని పంచిదంట్టూ హీరో నాని.. చెపుతున్నాడు. నానీ ... తారక్ స్థాయిలో ఎంటర్ టైన్  చేయగలడా..?..బిగ్ బాస్ హౌస్ లోని సెల బ్రెటీలు  ఏ రేంజ్ లో...  వినోదాన్ని పంచుతారో  తెలియాలంటే  కొన్ని రోజులు వేట్ చెయ్యాల్సిందే..?   

Related Posts